(3 Apr) బస్‌భవన్ ముట్టడిహైదరాబాద్, న్యూస్‌టుడే: వేతన సవరణ కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఐక్య కూటమి గు...
(3 Apr) బస్‌భవన్ ముట్టడిహైదరాబాద్, న్యూస్‌టుడే: వేతన సవరణ కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఐక్య కూటమి గురువారం బస్‌భవన్‌ను ముట్టడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 10వేల మంది కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అంతకుముందు సుందరయ్యపార్కు నుంచి బస్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. సభలో ఈయూ, టీఎంయూ రాష్ట్ర ఐక్య కూటమి అధ్యక్షులు సీహెచ్.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. నష్టాల పేరుతో ఆర్టీసీ కార్మికుల జీతాల పెంపును జాప్యం చేస్తే వూరుకునేది లేదన్నారు. వాస్తవాలను తెలియజేయకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే కార్మికులకు వేతన సవరణ జరగడం లేదన్నారు. టీఎంయూ అధ్యక్షులు తిరుపతి మాట్లాడుతూ సర్వీసు కండీషన్లు, అలవెన్సులు తదితరాలపై చర్చలు నిర్వహించిన యాజమాన్యం ఫిట్మెంట్ విషయంలో మాత్రం ఆర్టీసీ నష్టాల్లో ఉందని జీతాలు పెంచలేమన్న ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ మాట్లాడుతూ 20 వేల మంది కార్మికుల సమక్షంలో సమ్మె నోటీస్‌పై సంతకం చేసి యాజమాన్యానికి ఇస్తున్నామన్నారు. టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఇ.అశ్వద్ధామరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతంలో వేతనాలు పెరిగినా ఆంధ్రాలో పెరిగే వరకు తాము పోరాడతామన్నారు. ఎప్పుడు సమ్మెకు పిలుపునిచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. టీఎంయూ నాయకులు థామస్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కె.రాజిరెడ్డి, ఎస్.బాబు, బీవీరెడ్డి, హన్మంతారావు, రామకృష్ణ, ప్రసాద్, దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.15 తర్వాత సమ్మెకు దిగుతాంసభ అనంతరం ఈయూ, టీఎంయూ కార్మిక సంఘ నేతలు ఆర్టీసీ ఎండీ సాంబశివరావును కలిసి సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఈ నెల 15వ తేదీ తర్వాత సమ్మెకు దిగుతామన్నారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలకూ నోటీసులను అందజేశామన్నారుహైదరాబాద్లో ప్రయాణికుల ఇక్కట్లుఆర్టీసీ కార్మికుల ఆందోళన కారణంగా జంటనగరాల్లో బస్సు సర్వీసులు దాదాపుగా నిలిచిపోయాయి. ప్రధాన కూడళ్లకు మాత్రమే స్వల్పంగా బస్సులు తిరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు బస్సులు లేకపోవడంతో గంటల తరబడి బస్టాప్‌లలో వేచి చూడాల్సి వస్తోంది. పదోతరగతి పరీక్షల కోసం బయలుదేరిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
