(13 Apr) నెల్లూరు, ఏప్రిల్ 13 : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో ఆగిఉన్న చెన్నై-బిట్రగుంట ప్యాసింజర్ రైల్లో సోమవారం అగ్నిప...
(13 Apr) నెల్లూరు, ఏప్రిల్ 13 : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో ఆగిఉన్న చెన్నై-బిట్రగుంట ప్యాసింజర్ రైల్లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఇంజన్ నుంచి రెండో బోగీలో మంటలు చెలరేగాయి. వెంటనే మరో బోగీకి మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. చెన్నై నుంచి బిట్రగుంట వస్తున్న ప్యాసింజర్ రైలు సూళ్లూరుపేట ప్లాట్ఫారంపై ఆగింది. ఈ క్రమంలో రైల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. మంటలను అదుపు చేసేందుకు రైల్వే స్టేషన్కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తోంది. ప్రమాదానికి కారణం ఏమిటన్న అంశంపై రైల్వే అధికారులు, సిబ్బంది చర్చలు జరుపుతున్నారు షార్ట్ సర్క్యూట్వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణీకులు ఎవరైనా పేలుడు పదార్థాలు రైల్లో తీసుకువెళుతున్నారా? అన్న కోణంలో కూడా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.