మేడారం లో గల ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారల మ్మలను బుధవారం వరంగల్, ఖమ్మం, విజయన గరం, కరీంనగర్ జిల్లాల ట్రైనీ కలెక్టర్లు శృతి ఓజా, శశ...
మేడారం లో గల ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారల మ్మలను బుధవారం వరంగల్, ఖమ్మం, విజయన గరం, కరీంనగర్ జిల్లాల ట్రైనీ కలెక్టర్లు శృతి ఓజా, శశాంక్, శివశంకర్, అద్వైత్కుమార్ సింగ్ దర్శించుకు ని మొక్కులు చెల్లించారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చి న వారిని పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు డోలి వాయిద్యాల నడుమ ఆ హ్వానించి, గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ట్రైనీ కలెక్టర్లు అమ్మవార్ల గద్దెలపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు, ఈవో గోధుమల మల్లేశం వారిని సన్మానించారు. అనంతరం జాతర నిర్వహించే తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఆండ్ హెచ్వో దయా నందస్వామి, తహసీల్దార్ శంకర్లింగం, ఎంపీడీవో వసుమతి, తాడ్వాయి వైద్యాధికారి కోరం క్రాంతికుమా ర్, ఏటూరునాగారం సీఐ కిశోర్ కుమార్, తాడ్వాయి ఎస్ఐ సాంబమూర్తి, ట్రైబల్ వెల్ఫేర్ డీఈ మల్లయ్య, ఏఈ అబీద్ఖాన్, ఆర్డ బ్ల్యూఎస్ ఏఈ వెంకటసతీశ్ తదిత రులు పాల్గొన్నారు. అలాగే గోవిందరావుపేట మండలంలోని పర్యాటక ప్రాంత మైన లక్నవరం సరస్సును బుధవారం సాయంత్రం ట్రైనీ కలెక్టర్ల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా లక్నవరం అందాల ను వారు తిలకించారు. అ నంతరం లక్నవరం సరస్సు కింద ఆయకట్టు కుంట నీటి నిలువ సామర్థ్యం, సర స్సులోకి నీరు ఎలా చేరుకుంటుంది, లక్నవరం వాటర్ స్టోరేజీపై ఐబీ డీఈ ఆనందం, ఏఈ సుధీర్లను అడిగి తెలుపుకున్నారు. లక్నవరం సరస్సు పరిస్థితిపై మ్యాపును పరిశీలించారు. అనంతరం మచ్చాపురంలోని మొట్ల గానికుంటలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులను బృందం పరిశీ లించి సంతృప్తి వ్యక్తం చేసింది. వారి వెంట గోవిందరావుపేట తహసీల్దార్ పూల్సింగ్ చౌహాన్తో పాటు పలువురు ఉన్నారు.
