(27 Apr) ఉప్పల్, ఏప్రిల్ 26: దేవుడి దయవల్లే బతికి బయటపడ్డామని నేపాల్ నుండి క్షేమంగా ఇంటికి చేరుకున్న రామంతాపూర్ ఆర్టీసి కాలనీకి చెందిన మహ...
(27 Apr) ఉప్పల్, ఏప్రిల్ 26: దేవుడి దయవల్లే బతికి బయటపడ్డామని నేపాల్ నుండి క్షేమంగా ఇంటికి చేరుకున్న రామంతాపూర్ ఆర్టీసి కాలనీకి చెందిన మహిళలు సక్క్భుయిమేరు, శారద, లలితమ్మ, జయమ్మ అన్నారు. భూకంపం వల్ల నేపాల్ నష్టపోవడం తమకు ఎంతో బాధ కలిగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెను ప్రమాదంతో భయకంపితులైన తమకు అక్కడి ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుందన్నారు. హైదరాబాద్‌లోని ఇంటికి చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానంలో తీసురావడమే కాకుండా , ప్రత్యేక శ్రద్ధతో సౌకర్యాలు కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తీర్ధయాత్రల కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్లిన నగరంలోని రామంతాపూర్ ఆర్టీసి కాలనీకి చెందిన నల్గురు మహిళలు సక్క్భుయిమేరు, ఎం.శారద, లలితమ్మ, జయమ్మ ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు క్షేమంగా చేరుకున్నారు. అప్పటికే రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికోసం వేచియున్న కుటుంబ సభ్యులు వారిని దగ్గరగా హత్తుకుని మెడలో పూలమాలలు వేసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఇంటికి తీసుకురావడంతో ఇరుగుపొరుగువారు తరలి వచ్చి జరిగిన సంఘటన అనుభవాలను పంచుకున్నారు. నేపాల్‌లోని ఖాట్మాండ్లో భయంకరమైన విపత్కర భూకంపం నుండి వారు సురక్షితంగా బతికి బయటపడ్డారు. అక్కడ క్షేమంగా ఉన్నట్టు వచ్చిన సమాచారంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 17న సికింద్రాబాద్‌లోని సాయిబాబా ట్రావెల్స్ సహాయంతోకాశీ, నేపాల్, ముక్తినాథ్ తదితర పుణ్యక్షేత్రాలకు నగరంలోని మరికొంత మందితో కలిసి బయలు దేరిన విషయం తెలిసిందే. పశుపతినాథ్ ఆలయం సమీపంలో జరిగిన సంఘటతో భయాందోళనతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసి ప్రాణాలను రక్షించుకున్నారు. ఇదిలా ఉండగా ఇంటికి చేరిన నలుగురు మహిళలకు స్థానిక టిడిపి నాయకుడు సతీష్మేరు, ఇతర బస్తీ పెద్దలు కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి వారిని పరామర్శించి జరిగిన సంఘటన తీరును అడిగి తెలుసున్నారు.