హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. గౌలిగూడలోని రామమందిరం నుంచి ప్రారంభమ...
హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. గౌలిగూడలోని రామమందిరం నుంచి ప్రారంభమైన యాత్ర సికింద్రాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగనుంది.వేలాది ద్విచక్ర వాహనాలతో యువత యాత్రలో పాల్గొంటోంది. కాషాయ జెండాలు చేతబూని హనుమాన్ నామస్మరణతో భక్తులు చేస్తున్న సందడితో శోభాయాత్ర మార్గాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తోంది. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
