(8 Apr) * ఐఎస్ఐ తీవ్రవాదుల కదలికలపై ఆరా * నాకా బంద్, అడుగడుగునా తనిఖీలు * ఎన్కౌంటర్ మృతుల్లో ఒకరు ఖని వాసిగా అనుమానాలు గోదావరిఖ...
(8 Apr) * ఐఎస్ఐ తీవ్రవాదుల కదలికలపై ఆరా
* నాకా బంద్, అడుగడుగునా తనిఖీలు
* ఎన్కౌంటర్ మృతుల్లో ఒకరు ఖని వాసిగా అనుమానాలు
గోదావరిఖని, ఏప్రిల్ 7: వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో పారిశ్రామిక పట్టణం గోదావరిఖనిలో పోలీసులు అప్రమత్తమై వెంటనే హై అలర్ట్ చేపట్టి నాకా బంద్, ప్రధాన ఏరియాల్లో విస్తృత తనిఖీలు జరుపుతూ అనుమానితులను ఆరా తీస్తున్నారు. మంగళవారం ఉదయం ఆలేరు సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఐ ఎస్ ఐ తీవ్ర వాదులు మృతి చెందిన సంఘటనతో గోదావరిఖనిలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతోపాటు గోదావరిఖని పారిశ్రామిక పట్టణంలో కూడా ఐ ఎస్ఐ తీవ్ర వాదులు సంచరించారని సమాచారంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం రోజున 5వ ఇంక్లయిన్, విఠల్‌నగర్, చౌరస్తా, బస్టాండ్ ఏరియాతోపాటు ఎన్టీపీసీ, రామగుండం, రాజీవ్ రహాదారులపై వాహనదారులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానితుల వివరాలను సేకరించి ఆరా తీశారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నాకా బంద్, తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. గోదావరిఖని డిఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో వన్‌టౌన్ సిఐ వెంకటేశ్వర్లు,రామగుండం సిఐ నారాయణ ప్రత్యేక పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. కాగా ఆలేరు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఐఎస్ఐ తీవ్రవాది వికారుద్దిన్తోపాటు మృతుల్లో ఒక్కరు సయ్యద్ అమ్జద్ అనే తీవ్ర వాది గోదావరిఖనికి చెందిన వాడని అనుమానిస్తున్నారు. 15యేళ్ల క్రితం మృతుడు సయ్యద్ అమ్జద్ తండ్రి సింగరేణిలో డ్రైవర్‌గా ఉండి ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారని, కాగా సయ్యద్ అమ్జద్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదివినట్టు స్థానికులు తెలుపుతున్నారు. ఐతే పోలీసులు వద్ద మాత్రం ఏలాంటి ఆధారాలు లేవని గోదావరిఖని వన్‌టౌన్ సిఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఏది ఏమైనా గోదావరిఖని పారిశ్రామిక పట్టణంలో గతంలో కూడా ఐఎస్ఐ తీవ్ర వాదులు ఇక్కడ మకాం వేసి అంతర్గతంగా కార్యకలాపాలు జరిపినట్టు సమాచారంతో పోలీసు యంత్రాంగం అదే కోణంలో భారీ బందోబస్తు చర్యలను చేపట్టారు.