(2 Apr) సీసీసీ నస్పూర్: సీసీసీ నస్పూర్ గోదావరికాలనీ(షిర్కె)కు చెందిన పూసాల మురళి(28) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పో లీసుల క...
(2 Apr) సీసీసీ నస్పూర్: సీసీసీ నస్పూర్ గోదావరికాలనీ(షిర్కె)కు చెందిన పూసాల మురళి(28) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పో లీసుల కథనం ప్రకారం.. పూసాల మురళి మల్టీమీడియా చేసి ఇంట్లోనే ఉంటున్నాడు. బుధవా రం మధ్యాహ్నం దాటిన తర్వాత ముందు గదిలో ఫ్యాన్ రిపేర్ చేస్తానని ఇంట్లో వారికి చెప్పాడు. తల్లి, సోదరి బెడ్రూంలో పడుకోవడంతో కొద్దిసేపు తర్వాత ఆ గది డోర్‌కు గడియ బిగించాడు. ఇంటి ముందున్న పడారి గోడ గేట్‌కు తాళం వేసి ముందు గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మొదటి షిఫ్ట్ విధులకు హాజరై సా యంత్ర ఇంటికి వచ్చే సరికి ముందు గేట్‌కు తాళం వేసి ఉండడంతో ఉరేసుకున్న విషయం బయటకు వచ్చింది. మురళి ఆత్మహత్యకు గల కారణాలు తె లియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న సీసీసీ నస్పూర్ ఎస్ఐ ప్రమోద్‌రావు ఆత్మహత్య జరిగిన తీరును పరిశీలించారు. మృతిని జేబులో ఉన్న తన చావుకు ఎవరు కారణం కాదు అనే చీటీని, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తండ్రి ఓదె లు శ్రీరాంపూర్ ఏరియాలోని స్టోర్స్‌లో పనిచేస్తున్నాడు. ఎస్ఐ ప్రమోద్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
