నా వెంట నడిచింది మీరే

  -ఉద్యమాన్ని నిలబెట్టింది కార్యకర్తలే -అవమానాలు ఎదుర్కొని నిలబడ్డాం -అమరుల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం -కొట్లాడితేనే తెలం...

TRS plenary 2015 Photo gallery-I 
-ఉద్యమాన్ని నిలబెట్టింది కార్యకర్తలే
-అవమానాలు ఎదుర్కొని నిలబడ్డాం
-అమరుల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం
-కొట్లాడితేనే తెలంగాణలో పుష్కరాలు నిర్వహించారు
-కుంభమేళాను తలపించేలా రాష్ట్రంలో పుష్కరాలు
-సన్నబియ్యం పథకం చాంపియన్ ఈటల.. 
-చెప్పని పథకాలు అమలు చేస్తున్నాం
-పేదల గురించి ఆలోచించేవారంతా టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు
-మన పాలనలో అన్నీ అద్భుతాలే ఉంటాయి..
-టీఆర్‌ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్

హైదరాబాద్ : నాటి జలదృశ్యం నుంచి.. ఈనాటి జనదృశ్యం వరకూ నా వెంట ఉన్నది మీరే.. అని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌కు ఎనిమిదవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. శుక్రవారం ఎల్బీ స్టేడియం లో జరిగిన పార్టీ ప్లీనరీలో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. ఉద్యమాన్ని నిలబెట్టింది కార్యకర్తలేనని చెప్పారు. ప్రతి దశలో ఉద్యమాన్ని నడిపింది కార్యకర్తలలేనన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడిన ఘనత కార్యకర్తలదని చెప్పారు. యాస, భాష పేరుతో అనేక అవమానాలు ఎదుర్కొన్నామని అన్నారు. గులాబీ కండువాను కప్పుకున్నవాళ్లను అవహేళన చేశారని ఆయన గుర్తు చేశారు. వాటన్నింటినీ ఎదురొడ్డి నిలబడి రాష్ర్టాన్ని సాధించుకున్నామని చెప్పారు. శ్రీకాంతాచారి, యాదిరెడ్డి వంటి అనేక మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగం ఫలితమే తెలంగాణ రాష్ట్రమని కేసీఆర్ చెప్పారు. అమరవీరుల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. 

TRS-Plenary4


KCR-VICTORY

తెలంగాణ అస్తిత్వాన్ని చాటుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ప్రజలు అబ్బురపడేలా గోండు వీరుడు కొమురం భీమ్ స్మారక స్తూపాన్ని జోడేఘాట్‌లో నిర్మించుకోబోతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో త్వరలో తెలంగాణ కళాభారతికి శంకుస్థాపన చేయబోతున్నట్లు ప్రకటించారు. యాదగిరి గుట్టను దివ్య పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసుకుంటున్నామని ప్రస్తావించారు. తెలంగాణలో ఐదు వందల కిలోమీటర్ల దూరం గోదావరి ప్రవహిస్తున్నా ఆంధ్ర పాలకులు మాత్రం కేవలం 50, 60 కిలోమీటర్ల ప్రవహించే ఆంధ్రలోనే పుష్కరాలు నిర్వహించుకున్నారని కేసీఆర్ చెప్పారు. మా దగ్గర గోదావరి ప్రవహించడం లేదా? మా దగ్గర పుణ్యక్షేత్రాలు లేవా? అని తాను నిలదీయడంతోనే బాసర, ధర్మపురి, భద్రాచలం, కాళేశ్వరం తదితర ప్రాంతాల్లో పుష్కరాలు నిర్వహించారని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో పుష్కరాలను కుంభమేళాను తలపించేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ రావాలని గత పుష్కరాల్లో మొక్కుకున్నామని, ఈ పుష్కరాల నాటికి తెలంగాణ సిద్ధించిందని కేసీఆర్ అన్నారు. 

TRS-Plenary5

ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించిన కేసీఆర్.. 34 లక్షల మంది రైతులకు పంట రుణాలు మాఫీ చేశామని చెప్పారు. ఆసరా పింఛన్ల ద్వారా 35 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. గత పాలకులు ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసేందుకే స్కీమ్‌లు తీసుకువచ్చారని కేసీఆర్ చెప్పారు. బంగారుతల్లి పథకం అలాంటిదేనని అన్నారు. కానీ.. ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఇటువంటిదేనని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకాన్ని ఎవరూ అడగలేదని అన్నారు. దీనికి ఈ బడ్జెట్‌లో 330 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. పేదలనుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్నదని తెలిపారు. రేషన్ బియ్యం గతంలో సీలింగ్ విధించి.. నాలుగు కిలోల లెక్కన కుటుంబానికి 20 కిలోలు ఇస్తే.. పేదలకు కడుపు నిండా తిండి పెడతామని చెప్పి.. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికీ ఐదు కిలోల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. 

TRS-Plenary9

ఇందుకు మూడు వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. హాస్టళ్లకు సన్నబియ్యం అందిస్తున్నామని కేసీఆర్.. ఈ పథకం ఘనత ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌దేనని ప్రకటించారు. ఈ పథకానికి ఆయనే చాంపియన్ అని చెప్పారు. హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యం ఇద్దామని ఈటల చెప్పగానే తాను వెంటనే ఆ పథకం అమలు చేయాలని కోరానని తెలిపారు. పేద తల్లుల, పిల్లల సంక్షేమం చూసే అంగన్‌వాడీలు గతంలో హైదరాబాద్ వస్తే గుర్రాలు పెట్టి తొక్కించి, లాఠీచార్జి చేసిన సంగతిని గుర్తు చేసిన కేసీఆర్.. తమ ప్రభుత్వ హయాంలో వాళ్లను హైదరాబాద్‌కు పిలిచి.. వారితో మాట్లాడి.. కలిసి భోజనం చేసి.. వారికి వేతనాలు పెంచామని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమానిక 100 కోట్లు నిధి ఏర్పాటు చేశామని, తెలంగాణ సాధనలో అద్భుతంగా పని చేసిన కళాకారులను సాంస్కృతిక వారధి పేరుతో ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకున్నామని చెప్పారు.

పేదల గురించి ఆలోచించేవారంతా టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని కేసీఆర్ చెప్పారు. ఆరోగ్యలక్ష్మి పేరుతో గర్భిణులకు పోషకాహారం ఇస్తున్నామని చెప్పారు. 6వేల కోట్ల భారం పడినా ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని చెప్పారు. 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు పేదలను పట్టించుకోలేదని అన్నారు. తాము చేసేవన్నీ అద్భుతాలే ఉంటాయని అసెంబ్లీలో చెప్పామని గుర్తు చేశారు. ప్రజలే తమకు బాస్‌లని, వారికి ఏం కావాలో మాకు తెలుసుకాబట్టి.. వారి కల నెరవేర్చేందుకు అహోరాత్రులు కష్టపడి పని చేస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. త్వరలో దామరచర్లలో అల్ట్రామెగాపవర్ ప్రాజెక్టును యాదాద్రి థర్మల్ ప్లాంట్ పేరుతో పది రోజుల్లో శంకుస్థాపన చేసుకోబోతున్నామని అన్నారు. తెలంగాణ వస్తే అంధకారమేనన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడేం చెప్తారని ప్రశ్నించారు.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది

TRS-Plenary

తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో ఎలా పనిచేయబోతున్నదనేందుకు ప్రస్తుత విద్యుత్ సరఫరానే నిదర్శనం. ప్రాణిహిత చేవెళ్ల ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇటు ఉత్తర అటు దక్షిణ తెలంగాణను సశ్యశ్యామలం చేసే ప్రాజెక్టులను కుర్చేసుకొని కూర్చొని కట్టిస్థానని చెప్పిన.. కట్టిస్తం. ఇది తెలంగాణ గడ్డ.. ఎవడు అడ్డమొస్తడో చూస్తా అని స్పష్టంచేశారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి రామారావు నేతృత్వంలో వాటర్‌గ్రిడ్ పథకం పనులు అద్భుతంగా సాగుతున్నాయని సీఎం అన్నారు. వచ్చే నాలుగేండ్లలో ప్రాజెక్టును పూర్తిచేసి ప్రతి ఇంటికీ నళ్లా బిగించి నీళ్లిస్తాం. అలా చేయలేకపోతే మళ్లీ ఓట్లడగబోమని పునరుద్ఘాటించారు.

మీరందరూ (టీఆర్‌ఎస్ కార్యకర్తలు) ఎక్కడికక్కడ కథానాయకుల్లా మారి ప్రభుత్వ సంక్షేమ ప్రథకాలను ప్రతి లబ్దిదారుడికి అందేలా కృషిచేయాలి. ఏ ఊరికి ఆ ఊరు.. ఏ మండలానికి ఆ మండలం.. ఏ జిల్లాకు ఆ జిల్లాలో అందరూ కథానాయకులై పథకాలను ముందుకు తీసుకుపోవాలి అని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మెట్రో రైలును అటు యాదగిరి గుట్టవరకు.. ఇటు ఎయిర్‌పోర్టువరకు పొడిగించే ప్రతిపాదన ఉందని తెలిపారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో అందుకు తగినట్లుగా సౌకర్యాలు పెంచాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుత జనాభాకు వెయ్యి కూరగాయల మార్కెట్లు కావాలని, వాటి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

TRS-Plenary6

నగరంలో వాన పడితే పడవలే కావాలని సీఎం అన్నారు. ఈ పరిస్థితి పోవాలని, అందుకోసం కచ్చితమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే ది బెస్ట్ పారిశ్రామిక విధానం తెచ్చిందని వెల్లడించారు. కేజీ టు పీజీ ఉచిత విద్యపై చర్చలు జరుగున్నాయని, వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టేందుకు కృషిచేస్తామని తెలిపారు. వచ్చే రెండేండ్లలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ మేరకు ఇచ్చి తీరుతామని పేర్కొన్నారు. పేదలకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ చేస్తమని చెప్పినం. వందకు వందశాతం చేస్తం. మహిళా స్వయం సహాయ సంఘాలు, ద్వాక్రా సంఘాలకు ఇంతకాలం రూ.5 లక్షలే ఇచ్చేవారు. దీనిని రూ.10 లక్షలకు పెంచుతాం అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలను చూసి నిజంగా నేను గర్వపడుతున్నానని తెలిపారు. కార్యకర్తలకు చేతులెత్తి దండం పెడుతున్నా. 

50 లక్షల మంది సభ్వత్వాలు తీసుకొని మాకు మద్దతిచ్చారు. సభ్వత్వాల ద్వారా వచ్చిన సొమ్మును వారి సంక్షేమానికి కర్చుచేస్తమని మనవిచేస్తున్నా. మీ అందరి కృషివల్లనే ఈ స్థితికి రాగలిగినం అని తెలిపారు. రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తమని, బంగారు తెలంగాణ సాధనకు మరింత దీక్షతో కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. 

Key Tags
Movement activists erected , TRS , TRS party , trsplenary2015 , TRS , trs president , KCR trs president ,

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: నా వెంట నడిచింది మీరే
నా వెంట నడిచింది మీరే
http://namasthetelangaana.com/updates/2015/Aprl/25/TRS-Plenary11.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/04/blog-post_626.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/04/blog-post_626.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy