(21 Apr) తార్నాక, ఏప్రిల్ 20: జిహెచ్ఎంసి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయడానికి నిరంతర కృషి చేయడంతోపాటు అధినేత నమ్మకాన్ని నిలబెడతానని మైన...
(21 Apr) తార్నాక, ఏప్రిల్ 20: జిహెచ్ఎంసి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయడానికి నిరంతర కృషి చేయడంతోపాటు అధినేత నమ్మకాన్ని నిలబెడతానని మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో గ్రేటర్ అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ.. మైనంపల్లి పేరును గ్రేటర్ అధ్యక్షుడిగా ప్రతిపాదించగా నగర మంత్రులు పద్మారావు, తలసాని బరపర్చడంతోపాటు పోటీకి ఎవరు రాకపోవడం.. మైనంపల్లి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. తెలంగాణ భవన్లో మైనంపల్లి అనుచరుల హంగామాతో పండుగ వాతావరణం నెలకొంది. బాణాసంచా డప్పువాయిద్యాలతో తెరాస శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. గ్రేటర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికైన మైనంపల్లికి పూలదండలు పుష్పగుచ్ఛాలను అందజేశారు. గులాబీ జెండాను ఎగురవేస్తాం మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్, మ ంత్రు లు.. గ్రేటర్‌లోని నియోజకవర్గ ఇన్చార్జిలు తనపై ఉంచిన నమ్మకాన్ని మరింత నిలబెట్టు కోవడంతో పాటు తెరాస ప్రతిష్టను మరింత ఇనుమడింపజేస్తానని అన్నారు. కార్యక్రమంలో నగర నాయకులు సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు నగర, శివారు నాయకులు పాల్గొన్నారు.