వయోపరిమితి విధింపుతో మహిళా స్వావలంభనకు రిటైర్మెంట్

కరీంనగర్ : మహిళల ఆర్దిక ఎదుగుదలతోనే సమాజాభివృద్ధి సాధ్యమని నిన్నటిదాకా పదేపదే నీతి వాక్యాలు పలికిన పాలకులు తాజాగా తీసుకున్న నిర్ణయంతో వా...

కరీంనగర్ : మహిళల ఆర్దిక ఎదుగుదలతోనే సమాజాభివృద్ధి సాధ్యమని నిన్నటిదాకా పదేపదే నీతి వాక్యాలు పలికిన పాలకులు తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారి స్వావలంభనపై నీలినీడలు అలుముకుంటున్నాయి. స్వయం సహాయక సంఘాల్లోని 65 ఏళ్ళు దాటిన మహిళలను సంఘాల్లోంచి తొలగించాలంటూ ప్రభుత్వం చేసిన సూచనతో సెర్ప్ విడుదల చేసిన ఉత్తర్వులు, వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్వయం సహాయకసంఘాల్లో చేరడానికి కనిష్టంగా 18 ఏళ్ళుగా నిర్ణయిస్తూ, గరిష్టంగా 65 ఏళ్ళు నిండినవారిని తొలగించాలంటూ సర్కులర్ నెం.1/148/ఐబి/ ఎస్‌ఈఆర్/2015 ద్వారా సెర్ప్ సిఈవో మురళి విడుదల చేసిన సర్కులర్ డిఆర్‌డిఎ కార్యాలయాలకు చేరింది. ఎస్‌హెచ్‌జిల్లో కొనసాగేందుకు పలు విధివిధానాలతో కూడిన మార్గదర్శకాలు ఈ సర్కులర్‌లో పొందుపర్చగా, నిన్నటిదాకా స్వయం సహాయకసంఘాల్లో సభ్యులై ఉండి బ్యాంకు రుణాలు, వడ్డీలేని రుణాలు పొంది, ఇతరత్రా ఆదాయాభివృద్ధి పనులు చేసుకుంటున్న మహిళల్లో ఒకింత అసహనం వ్యక్తమవుతోంది. 60నుంచి 65ఏళ్ళకు పైబడిన మహిళలు అభయహస్తం, ఆసరా పింఛన్లు పొందుతూనే సంఘాల్లో కొనసాగుతున్నారు. వీరిలో అత్యధికమంది బ్యాంకు రుణాలు, వడ్డీలేని రుణాలు కూడా తీసుకుంటున్నారు. తీసుకున్న రుణంతో ఇతరత్రా వ్యాపారాభివృద్ధి పనులు చేయకుండా సభ్యుల అవసరాలకు వినియోగించటం, ఇతరులకు అప్పులుగా ఇవ్వటం జరుగుతుందనే భావనతో ఈవిధమైన దుర్వినియోగాన్ని అరికట్టేందుకు 65 ఏళ్ళు మించిన మహిళలను గౌరవప్రదంగా సంఘంనుంచి వీడ్కోలు పలికేందుకు సెర్ప్ నుంచి విడుదలైన సర్క్యులర్‌ను అనుసరించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దీనిననుసరించి 65 ఏళ్ళు దాటినవారికి బ్యాంకు లింకేజీలు ఇవ్వరాదు. సంఘానికి చెల్లించాల్సిన బ్యాంకు లింకేజీ, స్ర్తి నిధి, ఇతర రుణాలున్నా పూర్తిగా చెల్లించిన అనంతరమే వారికి రావాల్సిన వాటాను లెక్కించి ఆసభ్యురాలికి పూర్తిగా చెల్లించి గౌరవపూర్వకంగా వీడ్కోలు పలకాలి. అభయహస్తం కాని, ఆసరా పింఛన్‌కానిపొందే వారు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండరా దు, వికలాంగులు, వితంతువులు 60ఏళ్ళకంటే తక్కువ వయసున్న వారు సంఘంలో సభ్యులుగా కొనసాగచ్చని, 65ఏళ్ళు దాటినవారి వివరాలు, అభయహస్తం, ఆసరా పింఛన్లు పొందుతున్న స్వయం సహాయక సభ్యుల వివరాలు ఐబి వెబ్‌లో పొందుపర్చాలని, తద్వారా దీనిని పరిగణలోకి తీసుకుని పింఛన్లు మంజూరు, ఆర్థికసాయం లబ్దిచేకూర్చే అవకాశాలుంటాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఇదేగనుక నిఖార్సుగా అమలుచేస్తే జిల్లాలో ఇప్పటివరకు కొనసాగుతున్న 56,077 స్వయం సహాయక సంఘాల్లోని 6,57,946 మందిలో కనీసం 2.50లక్షలకు తగ్గకుండా ఉన్న 65 ఏళ్ళ పైబడిన మహిళలు రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ విధానంతో ప్రభుత్వానికి ఆర్థిక సాయం భారం తగ్గుతుండగా, లక్షలమంది మహిళలు బ్యాంకు రుణాలు, వడ్డీలేని రుణాలకు దూరమవటం ఖాయంగా మారుతోంది.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: వయోపరిమితి విధింపుతో మహిళా స్వావలంభనకు రిటైర్మెంట్
వయోపరిమితి విధింపుతో మహిళా స్వావలంభనకు రిటైర్మెంట్
http://3.bp.blogspot.com/-wPDs3A5rRJE/VTrfuUrfSpI/AAAAAAAAFEA/9pSp-3Ttkxg/s1600/rmp_banner.jpg
http://3.bp.blogspot.com/-wPDs3A5rRJE/VTrfuUrfSpI/AAAAAAAAFEA/9pSp-3Ttkxg/s72-c/rmp_banner.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/04/blog-post_675.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/04/blog-post_675.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy