హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పార్టీ ప్లీనరీ సమావేశం నేడు జరుగనుంది. ఇందుకోసం హైదరాబాద్ ఎల్...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పార్టీ ప్లీనరీ సమావేశం నేడు జరుగనుంది. ఇందుకోసం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలనుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జరగనున్న ఈ ప్లీనరీకి అధికారిక ఆహ్మానాల మేరకు 36వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. నేటి ప్లీనరీలో జరగనున్న కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి.
ఉదయం సెషన్
* 11.00 గం.: కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ పతాకావిష్కరణ. అమరులకు శ్రద్ధాంజలి
* 11.10 గం.: పార్టీ స్టీరింగ్ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి స్వాగతోపన్యాసం
* 11.20 గం.: పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు తొలి పలుకులు
* 11.30 గం.: పార్టీ నూతన అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును అధికారికంగా ప్రకటించనున్న టీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి
మధ్యాహ్నం సెషన్
* 11.35 గంటలకు టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షోపన్యాసం ప్రారంభం
* ఒంటి గంట నుంచి 2 వరకు భోజన విరామం
* రెండు గంటల నుంచి తీర్మానాలు.. చర్చ అనంతరం కేసీఆర్ ముగింపు ఉపన్యాసం.
