హైదరాబాద్ : ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూరు (ఎం) ఎస్ ఐ సిద్ధయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ...
హైదరాబాద్ : ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూరు (ఎం) ఎస్ ఐ సిద్ధయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సిద్ధయ్య చికిత్స పొందుతున్న కామినేని ఆస్పత్రి వైద్యులు సోమవారం మధ్యాహ్నం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఎస్ఐ పరిస్థితి విషమంగానే ఉందని, వైద్యానికి ఆయన శరీరం సహకరించటంలేదని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కామినేని ఆస్పత్రి వైద్యులను అడిగి సిద్ధయ్య ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కాసేపట్లో సిద్ధయ్య కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
