(14 Apr) హైదరాబాద్, : సూర్యాపేట వద్ద పోలీసు లను బలి తీసుకున ఉగ్రవాదుల్లో మూడో ఉగ్రవాది ఉంటే తమ చేతుల్లో నుంచి తప్పించుకోలేడని, తప్పకుండా...
(14 Apr) హైదరాబాద్, : సూర్యాపేట వద్ద పోలీసు లను బలి తీసుకున ఉగ్రవాదుల్లో మూడో ఉగ్రవాది ఉంటే తమ చేతుల్లో నుంచి తప్పించుకోలేడని, తప్పకుండా పట్టుకుంటా మని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. సిమీ ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు తెలంగాణ పోలీ సులు చూపిన ధీరత్వం, త్యాగం, ధైర్యసాహసాలు వర్ణించలే మని, కేంద్రం కూడా ప్రశంసించిందని అన్నారు. సోమవారం సచివాలయం లో సీనియర్ జర్నలిస్ట్ కళాసురేందర్ రచించిన పోలీస్ టైగర్స్ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సూర్యాపేట ఘటనలో మూడో ఉగ్రవాది ఉన్నారనటం ఊహాగానాలేనని, అందు కు సంబంధించిన సమాచారమేదీ లేదని, ఒకవేళ ఉంటే మాత్రం తెలంగాణ నుంచి తప్పించుకోలేడని స్పష్టంచేశారు. ఈ ఘటన తర్వాత దోపిడీ దొంగలే పోలీసు లపై కాల్పుులు జరిపి చంపారనుకున్నామని, అందుకే అదే ప్రకటన చేశామని, ఉగ్రవాదులకు సంబం ధించిన సమాచారాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం, నేషనల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) స్పష్టం చేసిన తర్వాత ఉగ్రవాదులుగా నిర్ధారించుకున్నా మని తెలిపారు. 2013 లో మధ్యప్రదేశ్ నుంచి పారిపోయిన సిమీ ఉగ్రవాదులుగా నిర్ధారణ జరిగిందన్నారు. పోలీసులపై ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ, ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో అత్యం త సాహసాన్ని ప్రదర్శించారని తెలిపారు. సూర్యాపేట ఆర్టీసి బస్టాండ్‌లో తొలుత కానిస్టేబుల్ లింగయ్యను హోంగార్డు మహేష్‌ను పొట్టనపెట్టుకు న్నారని, ఆ తర్వాత జానకీపురం ఘటనలో సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజు చనిపోయారని తెలిపారు. రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగిరెడ్డి, హోంగార్డు కిషోర్ గాయాలతో బయటపడ్డారని చెప్పారు. సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధయ్య బతుకుతాడని అనుకున్నామని, ఆసుపత్రి వైద్యులు కూడా ఆయన్ను బతికించేందుకు శాయశక్తులా కృషి చేశారని నాయిని తెలిపారు. కొడుకు కోసం బతుకుతాడని కూడా అనుకున్నామని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి అమరులపై పుస్తకం రాయడం అభినందనీయమన్నారు. పుస్తక రచయిత, అఖిల భారత ఫ్రీలాన్స్ జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి సురేందర్‌రావు మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, అమరులారా వందనం పేర మరొక పుస్తకం రాసినట్లు తెలిపారు.