కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్‌మిల్లు మూతబడి 7నెలలు గడుస్తున్నా ప్ర భుత్వం పట్టించుకోవడంలేదని మిల్లులో పనిచేస్తున్న కార్మికుల ఆందోళ...
కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్‌మిల్లు మూతబడి 7నెలలు గడుస్తున్నా ప్ర భుత్వం పట్టించుకోవడంలేదని మిల్లులో పనిచేస్తున్న కార్మికుల ఆందోళన చెందుతున్నారు. కోట్ల రూపాయల రుణాలను పొందిన యాజమాన్యం పలు కారణాలను చూపు తూ, నష్టాలబాటలో ఉందని, పలు ఆర్థిక కారణాలను చూ పుతూ యాజమాన్యం మిల్లును గత సంవత్సరం సెప్టెంబర్ 27 షెట్డౌన్పేరుతో మిల్లును మూసివేసింది. మిల్లును విస్తరించడానికి, మిల్లులో ఆధునిక మిషన్లను నెలకొల్పడానికి యాజమాన్యం వివిధ బ్యాంకుల ద్వారా 473 కోట్ల రుణాన్ని పొందింది. మిల్లును కొద్దిగా విస్తరించి, పాత యంత్రాన్ని కొనుగోలు చేసింది. దీంతో మిల్లుకు అనుకున్నంతగా ఉత్పత్తి జరగలేదు. మిల్లులో 8 పేపర్మిషన్లు ఉన్నాయి. తద్వారా ప్రతిరోజు 280 నుండి 350 మెట్రిక్ టన్నుల పేపర్ ఉత్పత్తి జరిగింది. పలు నష్టాలను చూపుతు యాజమాన్యం మిల్లును మూసివేసింది. అప్పటి నుండి కార్మికులు తమవిధులను నిర్వర్తిస్తున్నప్పటికి యాజమాన్యం కార్మికులకు ఒక నెల వేతనాన్ని చెల్లించింది. మరో ఆరునెలల వేతనాలను యాజమాన్యం చెల్లించలేదు. మిల్లు త్వరలోనే తెరుచుకుంటుందని ఆశతో ఉన్న కార్మికులు విధులకు హజరవుతున్నారు. మిల్లును రక్షిస్తామని గతంలో సిఎం చంద్రశేఖర్ రావు, జిల్లాకు చెందిన మంత్రులు ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వర్ రావులు హామీలిచ్చినప్పటికి మిల్లు తెరుచుకునే పరిస్థితులు కనబడకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిల్లును మూతబడకుండా ప్రభుత్వం చూస్తుందని కార్మికులు ఆశలుపెంచుకున్నారు. అసెంబ్లీ ఈమిల్లును గురించి సిఎం ప్రస్తావిస్తు మిల్లు విశయం కేంద్రం ఆధీనంలో ఉందని కెసీ ఆర్ ప్రకటించడంతో కార్మికుల ఆశలుసన్నగిల్లాయి. అప్పటి నుండి కార్మికులు జీవనోపాధికోసం ఇతర ప్రాంతాలకు వలసవెల్లుతున్నారు. విద్యార్థుల వేసవిసెలవులు ప్రకటిస్తే కార్మికులు వారి వారి స్వగ్రామాలకు వెల్లడానికి సిద్దమవుతున్నారు. సిర్పూర్ పేపర్‌మిల్లు ఇక పునప్రారంభం కాదనే బెంగతో ఇప్పటివరకు ఆరుగురు కార్మికులు మృతి చెందారు. నలుగురు కార్మికులు గుండెపోటుతో మృతిచెందగా, మరో ఇద్దరు కార్మికులు కిరోసిన్‌పోసుకుని బలవన్మరణాలకు పాల్పడ్డారు. మిల్లులో పనిచేస్తున్న విసి శుక్లా, కుమార్, అబ్దుల్ రహ్మాన్, అయిళ్ల భీమయ్యలు గుండెపొటుతో మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులు వాసాల సుధాకర్, కె.శంకర్ అను కార్మికులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణాలకుపాల్పడ్డారు. తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్చేస్తు అత్యవసర విబాగానికి చెందిన వాటర్ సరాఫరాప విబాగానికి చెందిన కార్మికులు మూడు రోజులుగా తమవిధులను బహిష్కరించారు. దీంతో క్వార్టర్లలో నీటిసరాఫరా నిలిచిపోయింది. కార్మికులు నీటికోసం అనేక ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు.