(23 Apr) ఆదిలాబాద్, ఏప్రిల్ 22: లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టుపై బ్యారేజిల నిర్మాణానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఇన్విస్టిగేషన్ నివేదిక రాగా...
(23 Apr) ఆదిలాబాద్, ఏప్రిల్ 22: లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టుపై బ్యారేజిల నిర్మాణానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఇన్విస్టిగేషన్ నివేదిక రాగానే బ్యారేజి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని గోదావరి బెసిన్ కమిషనర్ మధుసూదన్‌రావు అన్నారు. బుధవారం జైనథ్ మండలంలోని కోర్ట గ్రామాన్ని సంధర్శించి, పెన్‌గంగా ప్రాజెక్టు ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో రూడ వద్ద ప్రతిపాదించిన బ్యారేజి నిర్మాణ పనులను ఎగవన గల కోర్ట గ్రామానికి డిజైన్ మారిస్తే అదనంగా 13,500 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అటవీ పర్యావరణ అనుమతి ఇచ్చినందున బ్యారేజిల నిర్మాణంలో ఎలాంటి అవరోదం ఏర్పడదని, పెన్‌గంగా ప్రాజెక్టు నిర్మాణం వల్ల దిగువన గల ప్రాణహిత చేవెళ్లకు ఎలాంటి నష్టం ఉండదని మధుసూదన్‌రావు తెలిపారు. పెన్‌గంగా సర్వే కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2.8 కోట్లు విడుదల చేసిందని, మహరాష్టల్రో సాగులోకి వచ్చే పింపాడ్, రాజంపేట్ బ్యారేజిలతో పాటు తెలంగాణలో 80 శాతం సాగునీరు పెరుగనుంది. ఖరీఫ్‌కు ప్రణాళిక సిద్ధం ఆంధ్రభూమి బ్యూరో ఆదిలాబాద్, ఏప్రిల్ 22: 201516 ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళికకు సిద్దమవుతోంది. గత ఖరీఫ్‌లో రైతులు అనేక కష్టనష్టాలకు ఓర్చి ఆశించిన దిగుబడులు సాధించక నష్టపోగా, ఈ సారి ఖరీఫ్‌పైనే రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారిస్తూ కంటింజెన్సి ప్రణాళికతో సమాయత్తమవుతోంది. ఇందుకోసం జిల్లాలో పంటసాగు విస్తీర్ణం, వివిధ పంటల సాగుకు సరిపడా ఎరువులు, విత్తనాల అవసరాన్ని గుర్తించి ప్రణాళిక రూపొందించారు. గత ఏడాది 5.78 లక్షల హెక్టార్లలో పంటలు సాగుకాగా, ఈ ఏడాది 6.58 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గతం కంటే ఈసారి అదనంగా 80వేల హెక్టార్లలో పంటలు సాగుకానున్నాయి. ఇందుకోసం లక్షా 51వేల 450 క్వింటాళ్ల విత్తనాలు, 21.80 లక్షల పత్తివిత్తనాల ప్యాకెట్లు, లక్ష మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్దం చేసి, ప్రభుత్వానికి నివేదికలు పంపారు. విత్తనాల ప్రణాళిక జిల్లాలోని రైతులు వివిధ పంటల సాగుకు సరిపడే విత్తనాల ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించారు. సోయాబీన్ లక్షా 16వేల 250 క్వింటాళ్లు, వరి 24వేల క్వింటాళ్లు, మొక్కజొన్న 5వేల క్వింటాళ్లు, జొన్న 650 క్వింటాళ్లు, మినుములు 300 క్వింటాళ్లు, కందులు 650 క్వింటాళ్లు, నువ్వులు 100 క్వింటాళ్లు, వేరుశనగ వెయ్యి క్వింటాళ్లు, గోదుమ 350 క్విటాళ్లు మొత్తం 1.51.450 క్వింటాళ్ల విత్తనాలు, కాటన్‌సీడ్ 21.80 లక్షల ప్యాకెట్లు అవసరం ఉందని అధికారులు అంచనా వేశారు. ఎరువుల ప్రతిపాదన రైతులకు సరిపడే ఎరువులను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్దం చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఇందుకు గాను యురియా లక్షా 27వేల మెట్రిక్ టన్నులు, డిఏపి 35వేల 800 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 38 వేలు, పోటష్ 30 వేల ఎరువుల అవసరంను గుర్తించారు. కలుషిత నీటివల్లే ప్రజలకు ఇబ్బందులు ఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం ఉట్నూరు, ఏప్రిల్ 22: మండలంలోని బిర్సాయిపేట గ్రా మపంచాయతీ పరిధిలోని మోతిరాంగూడలో వ్యాధులు ప్రబలడానికి కలుషిత నీరే కారణమని, ఇందుకు సంబంధిత అధికారులు బాద్యత వహించాలని కలెక్టర్ జగన్మోహ న్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజుల క్రితం కలుషిత నీరు తాగి 40 మంది అస్వస్థత పాలుకాగా, వారిని కలెక్టర్ మోతిగూడలో పరామర్శించారు. ఈ సంధర్భంగా చెరువుల నీరు తాగవద్దని, బోరుబావి నీరే తాగాలని ప్రజలకు సూచించగా, బోరు చెడిపోయిందని, ఇంటింటికి పది రూపాయల చొప్పున వసూల్ చేసి ప్రైవేట్ మెకానిక్‌తో బా గుచేయించినా ఫలితం లేకుండాపోయిందని కలెక్టర్ దృష్టికీ తీసుకవచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ సుబానీపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబానికి చార్జెడ్క్లేమ్ చేయమని అర్డీవో ఐలయ్యను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన వారికి వైద్య సాయం అందించడంలో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
