(15 Apr) నేరడిగొండ, ఏప్రిల్ 14: మండల పరిధిలోని కొరటికల్ సమీపంలో గల జలపాతం హైవే రోడ్డుపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ...
(15 Apr) నేరడిగొండ, ఏప్రిల్ 14: మండల పరిధిలోని కొరటికల్ సమీపంలో గల జలపాతం హైవే రోడ్డుపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన రజియా సుల్తానా ఆదిలాబాద్‌కు తన బంధువు అంత్యక్రియలకు ఏపి13ఎస్ 0432నెంబర్ గల కారులో బయల్దేరింది. కొరటికల్ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డుపై నుండి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రజీయాసుల్తాన అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా, కారు డ్రైవర్ సమానొద్దిన్, సుల్తాన్, జమీలా, రహీమున్నిసాలకు తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. సంఘటన స్థలానికి నేరడిగొండ ఎస్సై నరేష్ కుమార్ చేరుకొని, సహయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.