(14 Apr) హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్లో ర...
(14 Apr) హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుకాలనీలు జలదిగ్భందంలో చిక్కుకోవడంతో విద్యుత్సరఫరా నిలిచిపోయింది. చింతల బస్తీలో రహదారిపై మోకాలిలోతు నీరు నిలిచిపోయింది. మియాపూర్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్తు తీగను తాకి ఇద్దరు మృతిచెందారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. గడచిన 24 గంటల్లో కామారెడ్డిలో 11, తాడ్వాయిలో 6, బయ్యారం, హకీంపేట, సదాశివనగర్, పగిడ్యాల, పాకాలలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.