(4 Apr) ఈ నెల 11 నుంచి 14వరకు ఆందోళన కార్యక్రమాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇందూరు, ఏప్రిల్ 3: సీఎంగా కేసీఆర్ పద...
(4 Apr) ఈ నెల 11 నుంచి 14వరకు ఆందోళన కార్యక్రమాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఇందూరు, ఏప్రిల్ 3: సీఎంగా కేసీఆర్ పది నెలల పాలనలో ప్రజలను మభ్యపెడుతూ ముందుకెళుతున్నారని, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోందన్నారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించక, యువకులకు ఉద్యోగాలు కల్పించకుండా.. కొన్ని చిన్న చిన్న పనులు మాత్రమే చేపడుతూ అభివృద్ది, సంక్షేమం అంటూ చెప్పుకుంటున్నారని ఆయన సర్కారుపై మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల నుంచి మొదలుకొని నగరాల్లోని పారిశ్రామికవేత్తల వరకు ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఏ ఒక్క ఖాళీని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణమన్నారు.అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, వ్యవసాయ రంగం, కరువుపై ఈ నెల 11వ తేదీ నుంచి 14వరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు, ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు, బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు, సామాజికంగా ప్రైవేట్ రిజర్వేషన్ల కోసం పోరాటం సాగిస్తామన్నారు.
