(15 Apr) ప్రభుత్వానికి టీఎన్ఏఐఎస్ఏ వినతి హైదరాబాద్ : తమను సొంత రాష్ట్రానికి తీసుకురావాలని తెలంగాణ నేటివ్ ఎంప్లాయీస్ ఇన్ సీమాంధ్ర...
(15 Apr) ప్రభుత్వానికి టీఎన్ఏఐఎస్ఏ వినతి
హైదరాబాద్ : తమను సొంత రాష్ట్రానికి తీసుకురావాలని తెలంగాణ నేటివ్ ఎంప్లాయీస్ ఇన్ సీమాంధ్ర అసోసియేషన్ (టీఎన్ఏఐఎస్ఏ) ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్థానిక ఇందిరా చౌక్‌లో మంగళవారం టీఎన్ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో తెలంగాణకు చెందిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పలువురు జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులతోపాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే సుధాకర్‌రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైనా పరాయి రాష్ట్రంలో పనిచేయడం బాధాకరమని, సొంత రాష్ట్రానికి సేవలందించాలనే తపన ప్రతీ ఒక్కరిలో ఉండడ సహజమేనని అన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రప్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించి వీలైనంత త్వరలో సొంత రాష్ట్రానికి వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే సొంత రాష్ట్రానికి పంపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వరాష్ట్రంలో పనిచేయడం తమ జన్మహక్కు అని టీఎన్ఏఐఎస్ఏ అధ్యక్షుడు రఘునందన్, అసోసియేషన్ ప్రతినిధి జయప్రకాశ్ అంకం అన్నారు.