(8 Apr) ముష్కరుల ఆచూకీకోసం ఎన్ఐఎ దర్యాప్తు వేగవంతం * పేట, అర్వపల్లిలో అనే్వషణ సూర్యాపేట, అర్వపల్లి,: జానకిపురం కాల్పుల్లో మృతిచెంది...
(8 Apr) ముష్కరుల ఆచూకీకోసం ఎన్ఐఎ దర్యాప్తు వేగవంతం
* పేట, అర్వపల్లిలో అనే్వషణ
సూర్యాపేట, అర్వపల్లి,: జానకిపురం కాల్పుల్లో మృతిచెందిన అస్లాం అయూబ్, ఎజాజుద్దీన్లను నిషేధిత సిమి సంస్ధకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించడంతో దేశంలోని అత్యున్నతమైన నిఘా సంస్ధన్ని ఈ ఘటనపై ఆరా తీస్తున్నాయి. మంగళవారం ఢిల్లీ నుండి జాతీయ పరిశోధన సంస్ధకు చెందిన అధికారుల బృందం ఎన్ఐఎ ఎస్పీ ప్రతిభ ఆధ్వర్యంలో సూర్యాపేట, అర్వపల్లిల్లో ఉగ్రవాదుల ఘటన స్థలాలను పరిశీలించారు. ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు వచ్చి అక్కడ నుండి నేరుగా సూర్యాపేటకు వచ్చిన ఎన్ఐఎ బృందం అధికారులు తొలుత స్ధానిక డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, డిఎస్పీ అబ్ధుల్ రశీద్లతో కొంతసేపు సమావేశమయ్యారు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు, అర్వపల్లిలో ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల ఘటనపై చర్చించి పలు వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. అనంతరం జిల్లా ఎస్పీతోకలిసి సూర్యాపేటలోని హైటెక్ బస్టాండ్‌లో పోలీస్‌లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటన స్థలాన్ని పరిశీలించి బస్టాండ్ పరిసరాలను గమనించారు. ఆ సమయంలోనే ఆలేరు సమీపంలో సిమి నేత వికరుద్దీన్ బృందం ఎన్కౌంటర్ సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ దుగ్గల్ హుటహుటిన అక్కడకు బయలుదేరి వెళ్లారు. ఆతర్వాత డిఎస్పీతో కలిసి ఎన్ఐఎ అధికారులు అర్వపల్లి మండలకేంద్రానికి చేరుకొని పలు ప్రాంతాలను పరిశీలించారు. తొలుత దర్గావద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సిబ్బంది ద్వారా పలు వివరాలు తెలుసుకున్న తర్వాత మండలకేంద్రంలో ఈనెల 4న ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగిన సీతారాంపురంలోని ఎస్ఆర్ఎస్పీ కాల్వ ప్రాంతాన్ని పరిశీలించారు.