(4 Apr) కోల్కతా: ఈ సంవత్సరపు మొట్టమొదటి సంపూర్ణ చంద్ర గ్రహణం శనివారం ఏర్పడనుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని భాగాల్లో సంపూర్ణంగా ...
(4 Apr) కోల్కతా: ఈ సంవత్సరపు మొట్టమొదటి సంపూర్ణ చంద్ర గ్రహణం శనివారం ఏర్పడనుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని భాగాల్లో సంపూర్ణంగా కనబడనుంది. ''ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం అరుణాచల్ ప్రదేశ్లోని తెజు, రోయింగ్ పట్టణాల్లో చంద్రోదయమైన వెంటనే 4 నిమిషాల 43 సెకండ్ల పాటు కనిపిస్తుంది'' అని రీసెర్చ్ అండ్ అకడమిక్ ఎంపీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ దేబిప్రొసాద్ దువారి తెలిపారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా గ్రహణం కనబడుతుందని వివరించారు. సాయంత్రం సుమారు 3.45 గంటలకు మొదలయ్యే ఈ గ్రహణం 5.27 నుంచి 5.32 వరకు సంపూర్ణంగా కనబడుతుంది. అనంతరం పాక్షిక గ్రహణం 7.14 వరకు కొనసాగుతుంది.
