కాసిపేట, : రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు బయటకు వెళ్ళాలంటేనే జంకుతున్నారు. దీంతో ప్రధాన రహాదారులు పగలు సమయంలో నిర్మానుష...
కాసిపేట, : రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు బయటకు వెళ్ళాలంటేనే జంకుతున్నారు. దీంతో ప్రధాన రహాదారులు పగలు సమయంలో నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుండే బానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ఇళ్ళ నుండి బయటకు రావాలంటేనే ప్రజలు బయపడుతున్నారు. అత్యవసర పనులు ఉంటేనే ఎండ తీవ్రతను తట్టుకునేందుకు అమ్మాయిలు స్కార్ప్లు, అబ్బాయిలు క్యాపులు దరించుకొని పనుల నిమిత్తం బయలుదేరుతున్నారు. ఎండకాలం ప్రారంభంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే ముందు ఎలా ఉంటుందోనని జనాలు ఆందోళన చెందుతున్నారు.పాఠశాల విద్యార్థులు పగటిపూట పరీక్షలకు వెళ్ళాలంటే ఎండతాకిడిని లెక్కచేయకుండా తప్పని పరిస్థితిలో పరీక్షలకు హాజరుకావల్సి వస్తుంది. అలాగే ఉపాధి కూలీలు మండుటెండలో సైతం పనులు చేయక తప్పడం లేదు. పని స్థలాల్లో కనీస వసతులు లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఇళ్ళలో ఉండాలంటే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కపోత నుండి ఉపశమనం కోసం తప్పని సరి పరిస్థితులలో కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. మర్కెట్లో వివిధ రకాల కూలర్లు అందుబాటులోకి రావడంతో వారి ఆర్థిక స్థోమతను బట్టి కూలర్లును ఎంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా శీతల పానీయాల అమ్మకాలు ఊపందుకున్నాయి. వీటికి తోడు కొబ్బరిబోండాలు, పుచ్చకాయలు, దోస వంటి వాటితో ప్రజలు ఎండ నుండి ఉపశమనం పొందుతున్నారు. ఎది ఏమైనా ఎండాకాలంలో వడ దెబ్బ తాకకండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
