సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేట మరోసారి ఉలిక్కిపడింది. మండలంలోని ఇమాంపేట స్టేజీ వద్ద గెయిల్ గ్యాస్ పైప్‌లైన్‌లో శనివారం భారీ పేలు...
సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేట మరోసారి ఉలిక్కిపడింది. మండలంలోని ఇమాంపేట స్టేజీ వద్ద గెయిల్ గ్యాస్ పైప్‌లైన్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు ఫైర్‌సేఫ్టీ అధికారులు మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు నిర్మించిన పైప్‌లైన్‌కు.. మార్గమధ్యంలోని ఇమాంపేట స్టేజీ సమీపంలో ఓ కార్యాలయాన్ని నిర్మించారు. నెల రోజులకొకసారి అక్కడ పైప్‌లైన్‌ను అధికారులు శుభ్రం చేస్తుంటారు. ఎప్పటిలాగే దానిని శుభ్రం చేయడానికి హైదరాబాద్ నుంచి అధికారుల వచ్చారు. అందులో భాగంగా పైప్ ఫిగ్‌ను లాగుతుండగా గ్యాస్ లీకై.. భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఫైర్‌సేఫ్టీ అధికారులు రోషన్ తేజార్ (42), రమేశ్ (35)లు పేలుడు తీవ్రతకు ఘటనా స్థలిలోనే మృతి చెందారు. ఎ.నర్సింహారావు, బాలకృష్ణ, గోసుల వెంకట్ తీవ్రంగా గాయపడ్డారు. వెంకట్ పరిస్థితి విషమంగా ఉంది.
