(15 Apr) జ్యోతినగర్, ఏప్రిల్ 14 : బొగ్గు కొరత నివారణలో భాగంగా ఎన్టీపీసీ విదేశీ బొగ్గు దిగుమతి చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నది. నిబంధ...
(15 Apr) జ్యోతినగర్, ఏప్రిల్ 14 : బొగ్గు కొరత నివారణలో భాగంగా ఎన్టీపీసీ విదేశీ బొగ్గు దిగుమతి చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నది. నిబంధనల ప్రకారం గతంలో విదేశీ బొగ్గును పరోక్ష పద్ధతిన మాత్రమే దిగుమతి చేసుకునే ఎన్టీపీసీ, ఇక ముందు ప్రత్యక్షంగా బొగ్గు దిగుమతి చేసుకోనుంది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు సడలిస్తూ డైరెక్ట్ ఇంపోర్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఎన్టీపీసీకి ఊరట లభించింది. ఇంతకాలం ఇతర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా విదేశీ బొగ్గును ఎన్టీపీసీ దిగుమతి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ పరోక్ష బొగ్గు దిగుమతి విధానం వల్ల సంస్థకు అనవసర ఆర్థిక భారం అయ్యేది. విదేశీ బొగ్గు దిగుమతి కోసం అదనంగా కోట్లాది రూపాయలను ఇతర సంస్థలకు చెల్లించాల్సి వచ్చింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ఎన్టీపీసీ విదేశీ బొగ్గును నేరుగా కొనుగోలు, దిగుమతి చేసుకునే వెసలుబాటు దొరికింది. ప్రతి ఏటా సుమారు 15 నుంచి 20 మిలియన్ టన్నుల విదేశీ బొగ్గును(ప్రధానంగా ఇండోనేషియా బొగ్గు) ఎన్టీపీసీ దిగుమతి చేసుకుంటున్నది. దీని కోసం కోట్లాది రూపాయలు అటు విదేశీ బొగ్గు సంస్థలతోపాటు ఇటు మధ్యవర్తిత్వం వహించే సంస్థలకు డబ్బు చెల్లించాల్సి వచ్చింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సుమారు 20 మిలియన్ మె ట్రిక్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించింది.