(2 Apr) కరీమాబాద్, ఏప్రిల్ 1: ఇటీవల వరంగల్ ఏనుమాముల వద్ద జరిగిన సామూహిక అత్యాచారంలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు, బంగారం చోరీ చే...
(2 Apr) కరీమాబాద్, ఏప్రిల్ 1: ఇటీవల వరంగల్ ఏనుమాముల వద్ద జరిగిన సామూహిక అత్యాచారంలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు, బంగారం చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి 371 గ్రాముల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ డిఎస్పీ సురేంద్రనాథ్ తెలిపారు. బుధవారం వరంగల్ మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న ఏనుమాముల గ్రామ ప్రజలను బాలాజీనగర్ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన బైరపాటి రాజ్‌కుమార్, దండం రవి, కడెం నర్సింహ, వానరాసి లక్ష్మీనారాయణ అనే నలుగురు ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ దేశాయిపేటలో నలుగురు నిందితులను అరెస్టు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అలాగే వరంగల్ కొండూరివారి వీధిలో గైక్వాడ్ మహదేవ్ అనే వ్యక్తి షాపులో పని చేస్తున్న మహారాష్టక్రు చెందిన జాదవ్ సందీప్ అనే వ్యక్తి యజమాని లేని సమయంలో షాపులోని 391 గ్రాముల బంగారం చోరీ చేసి పరారీలో ఉన్నాడని తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని మహారాష్ట వెళ్లి నిందితుని సోదరుడు జాదవ్ మహదేవ్ పండిట్‌ను అరెస్టుచేసి విచారణ జరుపగా వరంగల్‌లో బంగారం దాచినట్లు తేలిందన్నారు. పోలీసులు దాడి చేసి 371 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని కోర్టులో నిందితున్ని హాజరుపర్చినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 8లక్షల 60వేల రూపాయలు ఉంటుందని అన్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలి జఫర్గడ్, ఏప్రిల్ 1: పేద ప్రజలపై పెనుభారం మోపే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వ పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తిరాజు డిమాండ్ చేశారు. బుధవారం మండలకేంద్రంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని చెప్పి ఏ ఒక్కటీ అమలు చేయకుండా వారిపై ఇంకా భారం మోపే విధంగా విద్యుత్ చార్జీలు పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని, లేని ఎడల సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సోమయ్య, సుధాకర్, రమేష్, పాషా పాల్గొన్నారు.
