ఆహార భద్రత గల్లంతు..

(19 Apr)ఆహార భద్రత కార్డులు గల్లంతయ్యాయి. ఇక్కడి లబ్ధిదారుల పేర్లు, కార్డులు ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో జిల్లా...

aahaara
bhadrata gallantu..
(19 Apr)ఆహార భద్రత కార్డులు గల్లంతయ్యాయి. ఇక్కడి లబ్ధిదారుల పేర్లు, కార్డులు ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో జిల్లావాసులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.. వారి పేర్లతో నిత్యావసర సరకులను కూడా ఇక్కడ కోత పెట్టి అటువైపు కేటాయించడంతో అయోమయం నెలకొంది. ప్రతి చౌకధరల దుకాణం నుంచి పదుల సంఖ్యలో పేర్లు కనిపించకపోవడంతో అధికారులను ఆశ్రయిస్తున్నారు.. 'ఈనాడు-ఈటీవీ' బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించగా జిల్లాకు చెందిన పలువురి కార్డులు ఇతర ప్రాంతాలకు కేటాయించినట్లు తేటతెల్లమైంది. ఎలా జరిగిందో తెలియక అధికారులంతా తలలు పట్టుకుంటున్నారు.నా భార్య రేఖ పేరుతో ఆహార భద్రత కార్డు ఇచ్చారు. మా కుటుంబంలో అయిదుగురం సభ్యులం. మూడు నెలలుగా దుకాణం నెం.2లో సరకులు తెచ్చుకుంటున్నాం. 30కిలోల బియ్యం రావాల్సి ఉండగా.. 6 కిలోలు మాత్రమే ఇచ్చారు. ఇదేమిటని డీలర్‌ను అడిగితే.. కేవలం ఏడాది వయస్సు కలిగిన నా కూతురు అలేఖ్య పేరుతోనే బియ్యం వచ్చాయని మిగిలిన నలుగురి పేర్లు గల్లంతయ్యాయని.. అందుకే బియ్యం తక్కువొచ్చాయని చెప్పారు.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ బై్శ్ఠ=ఖి+2ఖిజిఆదిలాబాద్‌ పట్టణం శాంతినగర్‌లో నివసిస్తున్నాను. నలుగురం సభ్యులం కలిగిన మేము దుకాణం నెం.32లో రేషను సరకులు తెచ్చుకుంటున్నాం. కానీ.. ఈ నెలలో దుకాణానికి సరకులకోసం వెళితే.. నాపేరు గల్లంతయిందని డీలర్‌ చెప్పారు. ఫిర్యాదు చేయడానికి వచ్చినా.. ఎవరూ సరిగా స్పందించడంలేదు.జిల్లాలో 7,32,087 వరకు ఆహార భద్రత కార్డులున్నాయి. వీటిలో 52,272 అంత్యోదయ కార్డులు. 27.30 లక్షల మందికి ఆహార భద్రత కార్డులుండగా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ప్రతి నెలా 15వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. వీరిలో ఈ నెలలో 64,477మంది పేర్లు గల్లంతయ్యాయి. ఈ పేర్లన్నీ ఇతర ప్రాంతాల్లో చూపిస్తుండటంతో వారికి రావాల్సిన దాదాపు 400మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. ఇవి కాకుండా చక్కెర, కిరోసిన్‌ వంటి నిత్యావసర సరకులది కూడా అదే పరిస్థితి. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత తెల్లరేషను కార్డులకు బదులుగా ఆహార భద్రత కార్డులుగా పేరు మార్చి పంపిణీ చేసింది. ప్రతి సభ్యుడికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉన్నా.. వారందరికీ సరకులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే.. కార్డుల జారీ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి గందరగోళమే కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుతం కార్డులను ఎక్కువగానే జారీ చేసినా.. ఇంకా అర్హులైన వారికి పూర్తిస్థాయిలో అవి అందలేదనే విమర్శలున్నాయి. ఇదిలా ఉండగానే మూడేళ్ల్లలోపు పిల్లలకు, ఆధార్‌ కార్డులు లేని వారికి రేషను తొలగించడంతో ఆయోమయం నెలకొంది. ఈ సమస్యలన్నీ చాలవన్నట్లు ఇప్పుడు వేలాది మంది కార్డులు గల్లంతయ్యాయి. కొందరివి కార్డులకు కార్డులే గల్లంతు కాగా.. మరికొన్ని కార్డుల్లో సభ్యుల పేర్లు మాయమయ్యాయి. జిల్లా వాసులకు చెందిన కార్డులు, సభ్యుల పేర్లు విశాఖపట్నం, పశ్చిమగోదావరి, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, హైదరాబాద్‌ ప్రాంతాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఆయా జిల్లాల్లో చేరిపోవడంతో ఇక్కడి రేషను సరకులు కూడా అటువైపే తరలిపోయాయి. దీంతో ఇక్కడి దుకాణాలకు వెళితే మీ కార్డు లేదని.. సభ్యుల పేర్లు లేవని డీలర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో కార్డుదారులంతా అయోమయానికి గురవుతున్నారు. స్థానిక తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా దీనిపైన వారికి అంతుచిక్కడంలేదు. ఫలితంగా పలువురు జిల్లా పాలనాధికారి కార్యాలయానికి ఫిర్యాదులు చేసినా.. సరైన స్పష్టత లేకపోవడంతో అధికారులు సైతం తలలుపట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో నెలకున్న గందరగోళ పరిస్థితులతో ఏమి చేయాలో అధికారులకు అంతుచిక్కడంలేదు. అయిదేళ్లలోపు వయస్సు కలిగిన పిల్లల పేర్లన్నీ తొలగించారు. దీనికి ఆధార్‌కార్డులను సాకుగా చూపుతున్నారు. ఆ వయస్సు కలిగిన వారిలో కేవలం మూడు శాతం మందికి కూడా ఆధార్‌కార్డులు లేవు. పిల్లల పేర్లేకాకుండా కార్డుదారుడు, పెద్దల పేర్లు కూడా గల్లంతు కావడంతో జిల్లాలో ఈ సమస్య జఠిలంగా మారింది.ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన అయిదుగురు సభ్యులు కలిగిన షేక్‌ అనిఫాబేగం (కార్డునెం.ఏబీటీ369186671660)కు చెందిన ఆహార భద్రత కార్డు కర్నూలు జిల్లా ఎమ్మనిగూర ప్రాంతంలోని చౌకధరల దుకాణం నెం.1381020 పరిధిలోకి వెళ్లింది. మార్చి వరకు రేషను తీసుకున్న ఆమె ఏప్రిల్‌ నెలకు సంబంధించి బియ్యం తీసుకునేందుకు రేషను దుకాణానికి వెళ్లారు. ఆమె పేరు ఇక్కడ కాకుండా కర్నూలు జిల్లాలో కార్డునెం. ఆర్‌ఏపీ 138102008159లో చూపుతూ .. ఇక్కడి రేషను కోత విధించడంతో నిరాశకు గురైంది.బచేవాల్‌ లత (రి.నెం.ఏహెచ్‌వీ293276046248)కి చెందిన అయిదుగురు సభ్యులు కలిగిన ఆహార భద్రత కార్డులో ఆమె కూతురు మౌనిక పేరు పశ్చిమగోదావరి జిజిల్లాలోని నిద్నమూరులో దుకాణం నెం.0525004లో చూపారు. మౌనిక పేరు కార్డు నెం. డబ్ల్యూఏపీ 052500400406లో పేర్కొంటూ ఇక్కడి రేషను అక్కడికి తరలించి ఇక్కడ పేరు తొలగించారు. ఇదే కార్డులో సభ్యుడిగా ఉన్న రాహుల్‌ పేరుకూడా పశ్చిమగోదావరి జిల్లాలో కనిపించడం అయోమయంగా మారింది.ఖాన్‌ రఫీ (రి.నెం.ఏఎక్స్‌ఎల్‌ 008082448392) కార్డులో ఇద్దరి పేర్లు గల్లంతయ్యాయి. అబ్దుల్‌ రహ్మన్‌ఖాన్‌ పేరు పశ్చిమగోదావరి జిల్లాలో నిద్నమూరులో దుకాణం నెం.0525004లో కార్డునెం. డబ్ల్యూఏపీ 05250000364లో చూపిస్తుండగా.. ఖాన్‌ జమీర్‌ ఆహ్మద్‌ పేరు హైదరాబాద్‌లోని సర్కిల్‌నెం.2లో దుకాణంనెం.1672231లో ఉండటంతో ఇక్కడ వాళ్లకు నిత్యావసర సరకులు ఇవ్వకుండా తిరస్కరించారు.శర్మ బజరంగ్‌ (కార్డు నెం.ఏబీజీ 328146725243) కార్డు నుంచి బాలన్‌ శర్మ పేరు కర్నూలు జిల్లాలోని దుకాణం నెం.1381028లో కార్డునెం.138102800036లో కనిపిస్తోంది.జిల్లా వాసులకు చెందిన పేర్లు ఎందుకు గల్లంతయ్యాయో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ప్రతి చౌకధరల దుకాణం నుంచి దాదాపు 100లోపు పేర్లు మాయమయ్యాయి. తొలగించిన పేర్లకు రేషను కోటాను కూడా కోతపెట్టారు. ఆన్‌లైన్లో పరిశీలించగా ఆంధ్ర, రాయలసీమ, హైదరాబాద్‌ ప్రాంతాల్లో కార్డులున్నట్లు.. అక్కడ పేర్లు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే పేర్లు కనిపిస్తున్నాయో.. రేషను కోటా కూడా అక్కడికే తరలిపోయింది. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో అధికార యంత్రాంగానికి కూడా అంతుచిక్కడంలేదు.మీమంతా అనాదిగా ఆదిలాబాద్‌లోనే నివశిస్తున్నాం. గతం నుంచే నాకు తెల్లరేషను కార్డు ఉంది. నలుగురు సభ్యులం కలిగిన మా కుటుంబానికి నా భార్య వనజ పేరుతో ఆహార భద్రత కార్డును ఇచ్చారు. మూడునెలల పాటు రేషను దుకాణం నెం.15లో సరకులు తీసుకున్నా. కానీ.. ప్రస్తుతానికి మా కార్డు వేరో చోటుకు పోయిందని ఏప్రిల్‌ నెల సరకులు ఇవ్వకుండా నిలిపేశారు.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: ఆహార భద్రత గల్లంతు..
ఆహార భద్రత గల్లంతు..
http://acdn.newshunt.com/fetchdata5/20150419/eena/adilabad/images/350x350_IMAGE38603821.png
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/04/blog-post_847.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/04/blog-post_847.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy