చెరువు బాగుంటే .. ఊరు బాగుపడుతోందనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన మిషన్‌కాకతీయకు అండగా నిలిచేందుకు సింగరేణి సంస్థ ముందుకొచ్చింది. ప్రా...
చెరువు బాగుంటే .. ఊరు బాగుపడుతోందనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన మిషన్‌కాకతీయకు అండగా నిలిచేందుకు సింగరేణి సంస్థ ముందుకొచ్చింది. ప్రాథమికంగా ఓ చెరువును దత్తత తీసుకొని సహకారాన్ని అందించేందుకు గ్రామస్థులతో చేతులు కలిపింది. ప్రస్తుతం ఉన్న చెరువును విస్తరింపచేసి ఆయకట్టును కూడా పెంచనున్నారు. ఆ చెరువు పనులను మంగళవారం జిల్లా పాలనాధికారి జగన్మోహన్, సింగరేణి సీజీఎం వెంకటేశ్వర్రావులు ప్రారంభించనున్నారు.ఉపరితల గనుల (ఓపెన్‌కాస్ట్) కింద భూములు కోల్పోయి నిర్వాసితులైన వారిని ఆదుకునేందుకు సీజీఎం-శ్రీరాంపూర్ వెంకటేశ్వర్రావు ప్రత్యేక చొరవతో సింగరేణి సంస్థ ఉన్నతాధికారులను ఒప్పించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా మంచిర్యాల మండలం తాళ్లపల్లి చెరువు పూడిక తీయడానికి దత్తత తీసుకున్నారు. దీనికయ్యే ఖర్చులను భరించేందుకు సింగరేణి యాజమాన్యం ముందుకు రావడం జిల్లాలో ఇదే ప్రథమం. ఇదే స్పూర్తితో దాతలు ముందుకొస్తే మరిన్ని సత్పలితాలు వచ్చే అవకాశం ఉంది.శ్రీరాంపూర్ ఉపరితల గని పరిధిలోని తాళ్లపల్లి, సింగాపూర్ గ్రామాల ప్రజలు భూములను కోల్పోయి నిర్వాసితులయ్యారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సింగరేణి యాజమాన్యం ఇప్పుడు చెరువులు పూడికతీతకు పూనుకుంది. తాళ్లపల్లిలోని చెరువు పూడికతో నిండిపోయింది. దీంతో ఆ చెరువు పరిధిలో లెక్కకు 200 ఎకరాల ఆయకట్టు ఉన్నా.. కనీసం సగానికి సగం కూడా సాగయ్యే పరిస్థితులు లేవు. అక్కడి రైతుల కష్టాలను తీర్చడానికి సింగరేణి యాజమాన్యం ముందుకొచ్చింది.తాళ్లపల్లి చెరువు పూడిక తీయడం వల్ల రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం చెరువు లోతు 11.17హెక్టార్లు ఉండగా.. దాదాపు 18.67హెక్టార్ల వరకు విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించారు. దీని వల్ల నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగుతుంది. ప్రస్తుతం ఆ చెరువులో 0.00025టీఎంసీల నీరు నిల్వ ఉండే అవకాశం ఉండగా భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యాన్ని 0.00042టీఎంసీలకు పెంచనున్నారు. దాదాపు నీటి నిల్వ రెట్టింపు కావడంతో సాగు ఆయకట్టు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.చెరువు పునరుద్దరణకు అయ్యే ఖర్చు మొత్తాన్ని సింగరేణి సంస్థే భరించనుంది. ఈ పనులనూ కాంట్రాక్టుకు ఇవ్వకుండా సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహించనున్నారు. సంస్థకు చెందిన వాహనాలతోనే పూడిక తీత పనులు చేపట్టనున్నారు. కూలీలు అవసరమైతే చెల్లింపులు కూడా సింగరేణి సంస్థే భరించనుంది.సింగరేణి సంస్థ యాజమాన్యం చెరువు పూడిక తీయడానికి ముందుకు రావడం హర్షణీయం. ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువును పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ముందుకు వచ్చి పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. చెరువులో నీళ్లుంటే ఆ ఊరిలో సిరులు పండించుకోవచ్చు. దీని వల్ల ఆ ఊరు కరవు కాటకాలకు దూరంగా ఉండొచ్చు
