( 19 Apr) -బోర్డు సభ్యుడు మధుసూదన్‌రావు -సీసీసీ సీహెచ్‌పీలో రైల్వే బోర్డు డైరెక్టర్ల పర్యటన -రికార్డుల తనిఖీ సీసీసీ నస్పూర్: రై...
(
19 Apr) -బోర్డు సభ్యుడు మధుసూదన్‌రావు
-సీసీసీ సీహెచ్‌పీలో రైల్వే బోర్డు డైరెక్టర్ల పర్యటన
-రికార్డుల తనిఖీ
సీసీసీ నస్పూర్: రైల్వే ట్రాకులు దెబ్బతినకుం డా బొగ్గు సరఫరా చేయాలని ఇండియన్ రైల్వే టె క్నికల్ సర్వీస్(ఐఆర్టీఎస్)కు చెందిన రైల్వే బోర్డు సభ్యుడు, సలహాదారుడు మధుసూదన్‌రావు అ న్నారు. శనివారం సీసీసీ సీహెచ్‌పీలో రైల్వే బోర్డు డైరెక్టర్ల బృందం సభ్యులు పర్యటించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని సీసీసీ కోల్ హ్యాండ్లింగ్ ప్లాం టును సందర్శించారు. వ్యాగన్లలలో బొగ్గు కొలతలపై అధ్యయనంపై కమిటీ సభ్యుల పర్యటన దా దాపు మూడు గంటల పాటు కొనసాగింది. ముం దుగా సీహెచ్‌పీలోని అన్లోడ్ డిస్పాచ్ సిస్టంను పరిశీలించారు. వ్యాగన్లలో బొగ్గు పడే విధానానం, కంప్యూటర్ వ్యవస్థ, బొగ్గు తూకంను పరిశీలించారు. బొగ్గు సరఫరాకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. బోర్డు డైరెక్టర్లను జీఎం సయ్యద్ సుబానీ, అధికారులు, సన్మానించారు. అనంతరం మధుసూధన్‌రావు మాట్లాడుతూ వ్యా గన్లలో ఒకే రకమైన బొగ్గు లోడ్ ఉంచాలని సూ చించారు. అధునాతన ఆటోమెటిక్ సిస్టం ద్వారా వ్యాగన్లలో లోడింగ్ చేయాలన్నారు. ఇటీవలి కాలంలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ర్యాకుల పెం పునకు కృషి చేస్తామన్నారు. రైల్వే బోర్డు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు బెహర, ఉప్రేటి, భూపాల్‌రాజు, సి కింద్రాబాద్ ఏడీఆర్ఎం చంద్రిమారాయ్, సింగరేణి మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ నగియా, శ్రీరాంపూర్ జీఎం సయ్యద్ సుభానీ, ఓసీపీ, సీఎస్పీల జీఎం నాగేశ్వర్రావు, బెల్లంపల్లి, రామగుం డం రీజియన్ల క్వాలిటీ జీయంలు జయరామక్రిష్ణ, నిరిక్షణ్రాజు, ఎస్‌ఓటూజీఎం సత్యనారాయణ, ఏజీఎం(ఈఎంఅండ్ఎం) విజేందర్, సీహెచ్‌పీ డీజీఎం రామలింగం, సెక్యూరిటీ ఆఫీసర్ వేణుమాధవ్, టీబీజీకేఎస్ నాయకులు సమ్మిరెడ్డి, అ ర్కాల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
