(18 Apr) చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 17: జలమండలిలో వివిధ రకాల ఉద్యోగాల నియమకాలపై ప్రభుత్వం జారీ చేసిన జివోల ప్రకారం అర్హులైన వారిని నియమించాలన...
(18 Apr) చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 17: జలమండలిలో వివిధ రకాల ఉద్యోగాల నియమకాలపై ప్రభుత్వం జారీ చేసిన జివోల ప్రకారం అర్హులైన వారిని నియమించాలని ప్రభుత్వాన్ని గుర్తింపు పొందిన కామ్‌గార్ యూనియన్ డిమాండ్ చేసింది. జలమండలిలో జనరల్ పర్పస్ ఎంప్లారుూస్ కింద వాటర్సఫ్లై, సివరేజ్ విభాగంలో మొత్తం 658 మంది నియమాకం కోసం గత సంవత్సరం జనవరి 29న జీవోను జారీ చేసింది. జీవో ప్రకారం బోర్డులో పనిచేస్తున్న ఎన్ఎంఆర్, హెచ్ఆర్ లేబర్‌ను రెగ్యూలరైజ్ చేసింది. జలమండలి నియమించిన నియామక కమిటీ 510 మంది కార్మికులను రెగ్యూలరైజ్ చేసేందుకు ఆమోదించింది. ఇంటర్వ్యూలో పాల్గొన్న హెచ్ఆర్, ఎన్ఎంఆర్ కార్మికులను వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగ అవకాశం కల్పించి వారిని పర్మినెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని కామ్‌గార్ యూనియన్ అధ్యక్షుడు సి.సతీష్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ భూమయ్య, ప్రధాన కార్యదర్శి సిహెచ్ సూరేష్బాబు, కోశాధికారి రామరాజు తెలిపారు. వీరే కాకుండా ఇంటర్వ్యూలో పాల్గొన్న మరో 102 మందిని నియామక కమిటీ ఎంపిక చేసింది. ఇది పూర్తిగా విరుద్ధంగా ఉందని, అధికారులు వివిధ అక్రమాలకు పాల్పడి అర్హులైన వారిని ఎంపిక చేయకుండా అత్యధికంగా ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులను ఎంపిక చేయడమేమిటని, జనరల్ పర్పస్ ఉద్యోగాలకు ఏడవ తరగతి, పదోతరగతి అర్హత ఉన్నవాళ్లనే ఎంపిక చేయాల్సి ఉంటుందని ఆరోపించారు. ఇంటర్వ్యూలు కేవలం బోర్డులో పనిచేస్తున్న కొంతమంది అధికారుల అండదండలతో జరిగాయని, అర్హులైన వారు ఉద్యోగ అవకశాలను కోల్పోయారని యూనియన్ నేతలు విమర్శించారు. అధికారులు ఎంపిక చేసిన 102 మంది ఉద్యోగుల ఎంపిక లిస్టులో ఓకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నారు. 102 మందిని ఎంపిక చేసినా ఇంత వరకు ఒక్కరికి ఉద్యోగ ఉత్తర్వులను పంపలేదని, వీరిలో కొంత మంది కోర్టును ఆశ్రయించారని యూనియన్ ఆధ్యక్షుడు సతీష్‌కుమార్ వెల్లడించారు. జలమండలిలో ఉద్యోగాల కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ ఎంపిక విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను మార్చే అధికారం ఎవరికీ లేదని, జీవో ప్రకారం నియమకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం జలమండలి యాజమాన్యం ముందు ఉంచిన డిమాండ్లలో ఉద్యోగుల నియమకం ఒకటని, వీటితో పాటు వివిధ డిమాండ్లను సకాలంలో పరిష్కరించకుంటే యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో కామ్‌గార్ యూనియన్ నేతలు శ్రీనివాస్, యాదయ్య, చంద్రశేఖర్, ఎన్.నరేందర్ పాల్గొన్నారు. 'మతపరమైన విషయాల్లోకి అంబేద్కర్‌ను లాగొద్దు' ఖైరతాబాద్, ఏప్రిల్ 17: రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను సంఘ్ పరివార్ మత కార్యక్రమాల రొంపిలోకి లాగొద్దని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ కోరారు.