-నస్పూరు శివారులో ప్రభుత్వ భూమి కబ్జా -తప్పుడు రికార్డులతో సుమారు రూ.12 కోట్ల విలువైన -11 ఎకరాల 18 గుంటలు స్వాహా -రెవెన్యూ అధికా...
-నస్పూరు శివారులో ప్రభుత్వ భూమి కబ్జా
-తప్పుడు రికార్డులతో సుమారు రూ.12 కోట్ల విలువైన
-11 ఎకరాల 18 గుంటలు స్వాహా
-రెవెన్యూ అధికారులే సూత్రధారులు
-రూ. 65 లక్షలకు పైగా ముడుపులు
మంచిర్యాల మండలం నస్పూరు శివారులోని 48/1 సర్వే నెంబరులో సీలింగ్ పట్టా భూమి ఉం ది. అందులో 11 ఎకరాల 45 (18 గుంటల) సెంట్లు వెంకట మురళి మనోహర్‌రావుకు చెం దినది. 1955-58 పహనీ ప్రకారం మొత్తం విస్తీ ర్ణం 13 ఎకరాల 27 గుంటల భూమి ఉంది. అ యితే వెంకట మురళి మనోహర్‌రావు 1970, మే నాలుగో తేదీన చనిపోయాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో అంతకు ముందే వెంకట వసు మ న్‌రావు అనే వ్యక్తిని దత్తత తీసుకున్నాడు. 197 1లో నస్పూర్ గ్రామ భూములకు సంబంధించి జీపీఏ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ)ని వసుమన్ రావు, అనసూర్యదేవి కలిసి జీవీ సుధాకర్ రావు అనే వ్యక్తికి కట్టబెట్టారు. 1984-85లో ఆ సర్వే నెంబర్లో 1.26 ఎకరాల భూమిని కొందరికి అ మ్మేశారు. 1986లో సీలింగ్ చట్టం హై కోర్టు ట్రి బ్యునల్‌ను అనుసరించి ఈ సర్వే నెంబర్లోని 11.18 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవా లని ఆదేశాలు జారీ అయ్యాయి. బీ-2440/198 4 తేది:30.10.1984 ప్రకారం ఈ ఆదేశాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ భూమిపై కబ్జాదారుల కన్ను.. నస్పూర్ శివారులో భూములకు కోట్లాది రూ పాయల విలువ పెరుగడంతో ఈ భూమిపై కొంద రి కన్నుపడింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. 2012లో కబ్జాదారులు తప్పుడు పత్రాల పేరుతో భూమి తమదేనంటూ ముందుకు వచ్చారు. ప్రస్తుత పట్టేదారు కాలంలో కొనసాగుతున్న జీవీ వసుమన్రావు వద్దకు వెళ్లి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకువచ్చారు. 03.04.2013లో జమాబంధీ సైతం చేయించారు. ఈ పత్రాలలో ఏ ఒక్కటి కూడా సరైన పత్రం లేకుండానే ఇష్టమొ చ్చినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి మరీ భూమిని కాజేయడం గమనార్హం. బీ5/1745/8 5 తేది : 14.05.1985 ప్రకారం పత్రాలు సృష్టిం చారు. 50బీ, 10ఎన్సీ, అగ్రికల్చర్ యాక్టు 195 0 సర్టిఫికెట్ లక్షెట్టిపేట తహసీల్దార్ జారీ చేసినటు గా తీసుకున్నారు. ఎన్ఓసీ జీవీ వసుమన్రావు జారీ చేయగా ఆ ఎన్ఓసీ కూడా వసుమన్ రావు కు జారీ చేసే అధికారం కూడా లేదు. ఎందుకంటే అప్పటికే భూమిని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది కాబట్టి రెవెన్యూ అధికారుల తప్పిదం వల్ల ఆయన పట్టేదారు కాలంలో కొనసాగుతు న్నాడు. మరోవైపు జారీ చేసిన ఎన్ఓసీ కూడా అనుమానాలకు తావిస్తోంది. అవి నిజమైన పత్రాలేనా..! అటు భూమి కాజేసేందుకు ప్రయత్నించిన వ్య క్తులు ఇటు ఎన్ఓసీ సర్టిఫికెట్, మరికొన్ని రికార్డు లను పరిశీలిస్తే అవి నిజమైన పత్రాలేనా! అని అ నుమానం కలుగుతుంది. అసలు భూమి 11.18 ఎకరాలు కాగా ఎన్ఓసీలో మాత్రం 12 ఎకరాలు అని ఉంది. మరోవైపు లబ్ధిదారుల పేరుపై జారీ చేసిన ఎన్ఓసీలో లబ్ధిదారులకు ఎలాంటి భూమి లేదని చెప్పారు. వాస్తవానికి వారికి గర్మిళ్ల శివా రు లో 53 సర్వే నెంబర్లో ఎనిమిది గుంటలు, మం చిర్యాల శివారు 418 సర్వే నెంబర్లో రెండు ఎక రాలు, నస్పూర్ శివారులోని 72 సర్వే నెంబర్లో ఆరు ఎకరాల భూమి ఉంది. ఈ మధ్యలోనే 72 సర్వే నెంబర్లో జైపూర్ పవర్ ప్లాంటు వరకు ని ర్మించనున్న రైల్వే ట్రాక్ పనుల్లో భూసేకరణ కిం ద వీరికి డబ్బులు ముట్టాయి. ఇలాంటి వారికి ఈ భూమి అప్పగించడం గమనార్హం. మరోవైపు అధి కారులు జారీ చేసిన ప్రొసీడింగ్‌లో సైతం పలు త ప్పుడు తడకలు ఉన్నాయి. 1956 నుంచి ఇప్ప టి వరకు ఏ అధికారి ప్రొసీడింగ్ జారీ చేసినా అ న్ని పేజీలలో చివరన మాత్రమే సంతకం పెడు తారు. కానీ ప్రొసీడింగ్ రెండు పేజీల్లో సంతకం పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. తప్పుల మీద తప్పులు చేసిన అక్రమార్కులు ఈ భూమిని కాజేసేందుకు అక్రమార్కులు తప్పుల మీద తప్పులు చేశారు. 50బీ సర్టిఫికెట్‌కు సంబంధించి తహసీల్దార్ జారీ చేసినట్లు పలు అంశాలను పరిగణలోకి తీసుకొని జారీ చేస్తారు. ఒకటి పేదలై ఉండాలి, రెండోది ఎవరైతే పట్టాదా రు నుంచి భూమి సేకరిస్తుందో వారి అనుమతి, వాంగ్మూలం ఉండాలి, గిరిధవర్ నివేదిక తప్పని సరిగా జత పర్చాలి, గ్రామ పంచాయతీలో పబ్లిక్ నోటీసు అంటించాలి, మరోవైపు భూమికి సం బంధించిన చలాన్ రుసుం ప్రభుత్వానికి చెల్లించా లి, వీటన్నింటిని జతపర్చిన తరువాతే ఈ ఫైల్‌ను ఆర్డీవోకు పంపించి ఆయన అనుమతి తీసుకున్న తరువాతనే ఓకే చేయాలి. కాని 50బీ సర్టిఫికెట్తో పాటు మిగితావేవి కూడా పాటించకుండానే పని కానిచ్చేశారు. మరోవైపు భూమిని కాజేసేందుకు కొందరు మాత్రమే ప్రయత్నించారనడానికి ఆధా రాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులు సైతం 13 మంది కాగా కేవలం దీనికి సంబంధించి ము గ్గురే దరఖాస్తు చేసుకున్నారు. తమ తండ్రి 1964 లో భూమి కొన్నట్లు దరఖాస్తులో పేర్కొన్నారు. ఇ లా రకరకాలుగా తప్పుల తడకలుగా వారు రికా ర్డులు సృష్టించారు. తిలాపాపం.. తలా పిడికెడు... అక్రమార్కులు ఈ విధంగా చేసుకుంటూ పో గా దానికి రెవెన్యూ అధికారులు సైతం తాన తం దానా అంటూ వంతపాడారు. ఈ సర్వే నెంబర్ 48/1కి చెందిన పైలు ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో హడావిడిగా తయారు చేశారు. రెవెన్యూ సీలింగ్ డిలేషన్ చేయాలంటూ ఆర్డీవో కార్యాల యానికి తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫైల్ వెళ్లింది. నెంబర్ సీసీ/1290-1293/75, తేది : 10.10.2013న వెళ్లింది. ఇదే ఫైల్ నెంబర్‌తో మరో ఫైల్ కూడా వెళ్లడం అధికారుల తప్పిదానికి తార్కాణంగా నిలుస్తోంది. వాస్తవానికి ఆర్డీవో కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయానికి తిరిగి ఎలాంటి అనుమతులు కాని, ఫైల్కాని రాలేదు. కానీ, ఫిబ్రవరి చివరి వారంలో కొందరు కబ్జాదారులు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పడంతో కబ్జా చేసేకునేందుకు అనుమతి లభించింది. మరోవైపు 07.03.201 5న ప్రభుత్వ భూమి అని ఇక్కడ బోర్డు పాతిన అధికారులు అందులో 14 ఎకరాల 13 గుంటలు అని రాశారు. తమ తప్పు తెలుసుకొని మళ్లీ 11. 18 ఎకరాలు అని పెట్టడం గమనార్హం. పెద్ద ఎత్తున ముడుపులు... ఈ భూ దందాలో దాదాపు 65 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో కొందరు రెవెన్యూ అధికారులు పోలీసులు తమ జోలికి రాకుండా ఉండేందుకు ప్లాట్లు కేటాయిం చడం గమనార్హం. ఇందులో మరో కో ణం ఏమి టంటే ఈ భూమిని రియల్ ఎస్టేట్ వ్యా పారులు వెంచర్లుగా చేసి అమ్మేశారు. భూమిని దీనిని చూ పించి అమ్మినప్పుడు మాత్రం సర్వే నెం బర్ 46 పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం గమ నార్హం. దాదాపు 100 నుంచి 130 మంది వరకు బాధితు లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రభుత్వ భూమి బోర్డు పెట్టడంతో ఏం చేయాలో దిక్కుతో చక బా ధితులు లబోదిబోమంటున్నారు. ఇలా కబ్జాదారు లు అడ్డగోలుగా యథేచ్చగా భూకబ్జాల కు పాల్ప డుతుండగా రెవెన్యూ అధికారులు సైతం తాన తందానా అంటూ వంతపాడడం విమర్శల కు తా విస్తోంది. ఇప్పటికైనా భూకబ్జాలపై జిల్లా అ ధికారులు దృష్టి సారించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.