-అటవీభూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు -అడ్డొచ్చే అధికారులకు మామూళ్లు మంచిర్యాల : జిల్లాలో మొత్తంగా 25 క్వారీలు ఉన్నాయి. మంచిర్యాల ప్రాంతంలో ఓస...
-అటవీభూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు
-అడ్డొచ్చే అధికారులకు మామూళ్లు
మంచిర్యాల : జిల్లాలో మొత్తంగా 25 క్వారీలు ఉన్నాయి. మంచిర్యాల ప్రాంతంలో ఓసీసీకి దేవాపూర్, ఎం సీసీకి తిమ్మాపూర్లో, గూడెంలో క్వారీలకు అను మతులున్నాయి. ఇవి మినహా ఏ ఒక్క దానికి అ నుమతుల్లేవు. కానీ, అనధికారికంగా తూర్పు ప్రాంతంలో యథేచ్ఛగా బండ క్వారీలు నడుస్తు న్నాయి. మంచిర్యాల, తాండూరు, బెల్లంపల్లి ప్రాంతాల నుంచి బండ జోరుగా తరలుతున్నది. మంచిర్యాలలోనైతే అక్రమంగా పెద్ద క్వారీలు న డుస్తున్నా, అధికారులు దృష్టి పెట్టడం లేదు. ము డుపులు ముట్టజెప్పడం వల్లే ఎవరూ పట్టించు కో వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జోరుగా తరలింపు..
ఏసీసీ నుంచి అండాళమ్మ కాలనీకి వెళ్లే ప్రాం తంలో, ర్యాలీ ప్రాజెక్టు ప్రాంతంలో చిన్నచిన్న కొండలను పిండి చేస్తున్నారు. పట్టా భూముల పే రిట చెరపట్టిన పలువురు, హద్దులు దాటి అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు. ఇక్కడ ఎలాంటి అనుమతుల్లేకున్నా యంత్రాలతో బండ రాళ్లుగా మారుస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా జోరుగా తరలిస్తూ, మంచిర్యాల చుట్టు పక్కల ప్రాంతంలో అమ్ముతున్నారు. ఒక్కో ట్రాక్టర్కు 2 వేల నుంచి 3 వేల దాకా వసూలు చేస్తున్నారు. నిత్యం 20 నుంచి 30 ట్రాక్టర్లలో తీసుకెళ్తున్నారు.
రూ.లక్షల్లో సంపాదన..
క్వారీ దందాతో ఓ వ్యాపారి కోట్లకు పడగెత్తా డు. నెలానెలా లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించుకుంటున్నాడు. తనకు అడొచ్చే పలు వురు అధికారులను మామూళ్లతో లొంగదీసు కుంటాడు. అదే సమయంలో తనకు ఎవరూ పో టీ లేకుండా చూసుకుంటాడు. మంచిర్యాల ప్రాం తంలో ఇళ్ల నిర్మాణం, పునాది కోసం అవసర మయ్యే ఈ బండను ఆయన వద్ద నుంచే తీసుకెళ్లా ల్సిన పరిస్థితి. ర్యాలీ ప్రాజెక్టు ప్రాంతంలో కూడా ఓ వ్యాపారి ఇదే దందా చేస్తున్నాడు. అక్కడ కూ డా అటవీ భూముల నుంచి బండ తరలిస్తు న్నా డు. వీరిద్దరూ కోట్లాది రూపాయలు సంపాదిస్తూ, సర్కారు ఆదాయానికి గండి పెడుతున్నారు.
ఖనీలు వేశారు.. మరిచారు..
అండాళ్లమ్మ కాలనీ సమీపంలో, ర్యాలీ ఏరి యాలోని అటవీ భూముల పరిధిలో అటవీశాఖ అధికారులు ఖనీలు పాతారు. కానీ, ఇటువైపు క న్నెత్తి చూడడం మరిచిపోయారు. దీంతో ఈ ప్రాం తంలోని బండ రాళ్లపై కన్నేసిన పలువురు అక్ర మార్కులు, నిత్యం కొండలను ఖతం చేస్తున్నారు. ఇదంతా కళ్లముందే కనిపిస్తున్నా, ఎవరూ స్పం దించకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.
పట్టని అధికారులు..
అక్రమంగా బండ జోరుగా తరలిస్తున్నా, ఎవ రూ కన్నెత్తి చూడడం లేదు. సంబంధిత శాఖల అ ధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యం గా భూగర్భ గనుల శాఖ కార్యాలయం మంచిర్యా లలోనే ఉన్నా, చోద్యం చూడడం విమర్శలకు తా విస్తున్నది. కొందరు మామూలుగా తీసుకుంటు న్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, దృష్టి సా రించడం లేదని తెలుస్తున్నది. దీంతో క్వారీల వద్ద తవ్వకాలు పెరిగి, పెద్ద బొందలు ఏర్పడ్డాయి. భ విష్యత్లో పూడ్చలేని విధంగా తయారయ్యాయి. ఇదంతా కళ్లముందే కనిపిస్తున్నది. ఇప్పటికైనా అ ధికారులు స్పందించాల్సిన అవసరమున్నది.