నల్లగొండ జిల్లాలో వికార్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలతో సుమోటోగా...
నల్లగొండ జిల్లాలో వికార్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలతో సుమోటోగా కేసును స్వీకరించి నోటీసులు జారీచేస్తున్నట్టు కమిషన్ ఆదేశాల్లో పేర్కొంది. రెండు వారాల్లోగా ఎన్కౌంటర్ ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)కి నోటీసులు జారీచేసింది. విచారణకు సంబంధించి ఈ నెల 23న కమిషన్ హైదరాబాద్‌లో పర్యటిస్తుందని పేర్కొన్నారు.
