(12 Apr) మహబూబ్నగర్, ఏప్రిల్ 11: ''బీసీగా పుట్టడమే నేను చేసిన పాపమా? బీసీ కులంలో పుట్టినందుకే జిల్లాకు చెందిన ఇద్దరు అగ్రవర్ణ ...
(12 Apr) మహబూబ్నగర్, ఏప్రిల్ 11: ''బీసీగా పుట్టడమే నేను చేసిన పాపమా? బీసీ కులంలో పుట్టినందుకే జిల్లాకు చెందిన ఇద్దరు అగ్రవర్ణ నేతలు నాకు ఉన్నత పదవి రాకుండా అడ్డుకున్నారు. కేసీఆర్ సానుకూలంగా ఉన్నా, వీరిద్దరి ఎత్తుగడలతో నాకు దక్కాల్సిన పదవి దక్కకుండా పోయింది'' అంటూ పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్ గౌడ్ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు జరిగిన అన్యాయంపై కంటతడి పెట్టుకున్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 189వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న ఇద్దరి పేర్లను త్వరలో బయటపెడతానని ప్రకటించారు. 10 నెలలుగా ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నానని, తన నియోజకవర్గంలో ఎన్నో పనులు చేశానని, పట్టణంలో భూత్పూర్ రోడ్డు విస్తరణకు, పెద్ద చెరువు అభివృద్ధికి ఎంతో చేశానని, తనకు మంచి పేరు రాకూడదని, ఉద్యమాల పత్రికల్లో తన పేరును రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.