singareni employees (4 Apr) కొత్తగూడెం, ఏప్రిల్ 3: నాలుగు జిల్లాలలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో బొగ్గు అధికోత్పత్తి సాధించడానికి ...
![]() |
| singareni employees |
(4 Apr) కొత్తగూడెం, ఏప్రిల్ 3: నాలుగు జిల్లాలలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో బొగ్గు అధికోత్పత్తి సాధించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలుచేసి సత్ఫలితాలు సాధించిన యాజమాన్యం గనులు, డిపార్టుమెంట్ల వద్ద కూడా సదుపాయాలు కల్పిస్తున్నారు. తాజాగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ ఆదేశాలతో రూపకల్పన చేసిన 'మీకోసం - మీచెంతకు' కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11ఏరియాలలో ఆయా ఏరియాల చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, ఏరియాలోని వివిధ విభాగాల అధికారులు, గుర్తింపుసంఘం నాయకులు కలిసి సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాలనీలలో ఉన్న సౌకర్యాలు, ఇంకాచేపట్టాల్సిన సదుపాయాలు క్షుణ్ణంగా పరిశీలించి కాలనీలలో నివసిస్తున్న కార్మికుల కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించి స్వయంగా సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి సత్వరచర్యలు ఈకార్యక్రమం ద్వారా చేపట్టనున్నారు. వీధిదీపాలు, డ్రైనేజీ, డస్ట్బిన్లు, శుభ్రత, పరిశుభ్రత, రూఫ్లీకేజీ తదితర సమస్యలను తెలుసుకొని వెంటనే చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా ఆయా కాలనీల ప్రధాన సెంటర్లలో అవసరాన్ని బట్టి సభలను ఏర్పాటు చేసి కాలనీలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధికారులతో సమస్యలపై వివరించాల్సిన పద్ధతులపై సోదాహరణంగా వివరించనున్నారు. కాలనీలలోని క్వార్టర్లలో ఎర్రబల్బులు వాడడం నిషేధించినప్పటికి ఇంకా కొందరు వాటిని వాడుతున్నారని సమాచారం ఉండడంతో కఠినచర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. క్వార్టర్లలో ఎర్రబల్బులు వాడే వారి ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని కూడా స్పష్టమైన హెచ్చరికలను ఇదివరకే జారీ చేశారు. వినూత్నంగా నిర్వహించే కార్యక్రమం సందర్భంగా ఎవరైనా ఎర్రబల్బులు వాడినట్లు రుజువైతే వారి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. ఎర్రబల్బులకు బదులుగా ఎల్ఇడి, సిఎఫ్ఎల్ బల్బులను వాడి విద్యుత్‌ను పొదుపు చేసి సంస్థకు, బంగారు తెలంగాణ రాష్ట్రానికి చేయూత నివ్వాలని కూడా యాజమాన్యం కాలనీ వాసులకు విజ్ఞప్తి చేస్తోంది. కొత్తగూడెం ఏరియాలో మీకోసం - మీచెంతకు కార్యక్రమ వివరాలు కొత్తగూడెం ఏరియా పరిధిలో మీకోసం - మీచెంతకు కార్యక్రమాన్ని ఆదివారం నుండి ప్రారంభించి ఈనెల 10వతేదీ వరకు ఏరియా చీఫ్ జనరల్ మేనేజర్ ఎం మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 4వతేదీన దన్బాద్కాలనీ, మార్కెట్ఏరియా, వెల్ఫేర్‌సెంటర్, 6వతేదీన గౌతంపూర్ టి2, మిలీనియం, ఎండి క్వార్టర్స్, గౌతంపూర్ సి2క్వార్టర్స్, 7న రుద్రంపూర్ నాల్ఏరియా, గోఫ్ ఏరియా, ఎర్రగడ్డ, 4ఇంక్లైన్, 3ఇంక్లైన్, బేరియంక్వార్టర్స్, 8న పంజాబ్‌గడ్డ ఏరియా, రామవరం, రుద్రంపూర్ ఎన్‌సి, ఎన్బి, బి, ఎ అండ్ బి, చమ్రీస్, 9న నాగయ్యగడ్డ, రామవరం, 10న నెహ్రుబస్తీ, రామవరం, సిఆర్పిక్యాంప్, వెల్ఫేర్‌సెంటర్, రామవరంలలో పర్యటనలు ఉంటాయి. 6వతేదీన గౌతంపూర్కాలనీలో సిఎండి శ్రీ్ధర్ పర్యటించడంతో పాటు కమ్యూనిటీహాల్ వద్ద జరిగే బహిరంగసభలో పాల్గొంటారని ఏరియా అధికారులు తెలిపారు.
