(21 Apr) బాసర, ఏప్రిల్ 20: బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటిలో విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. యూనివర్సిటిలోని తెలంగాణకు చెందిన మెస్‌లో ...
(21 Apr) బాసర, ఏప్రిల్ 20: బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటిలో విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. యూనివర్సిటిలోని తెలంగాణకు చెందిన మెస్‌లో సరిపడా భోజనం పెట్టడం లేదని విద్యార్థులు మెస్‌కు సంబంధించిన కిటికి అద్దాలు పగలగొట్టారు. సోమవారం 3 వేల మంది విద్యార్థులకు భోజనం అందించే తెలంగాణ మెస్ నిర్వాహకులు మధ్యాహ్నం సరిపడా భోజనం పెట్టకపోవడంతో మెస్ ఆవరణలో బైఠాయించారు. యూనివర్సిటీకి చెందిన అధికారులు విద్యార్థులకు నచ్చచెప్పినప్పటికి విద్యార్థులు శాంతించలేదు. మెస్ నిర్వాహకులు విద్యార్థులందరికి సరిపడా భోజనం పెడతామని హామీనివ్వడంతో విద్యార్థులు శాంతించారు. పోలీసు ఫిర్యాదు విభాగంలో అర్జీలు పరిష్కరించాలి: ఎస్పీ తరుణ్ జోషి ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 20: ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించడంలో పోలీసు అధికారులు జాప్యం చేయకూడదని, సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ తరుణ్ జోషి అన్నారు. సోమవారం పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. ఈ సంధర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల నమోదు అనంతరం సైతం ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించబడ్డాయా లేదా తెలుసుకునే బాధ్యత దర్యాప్తు అధికారులపై ఉందని అన్నారు. ముఖ్యంగాకుటుంబ సంబంధిత కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, మహిళలు నిర్భయంగా ఉండేందుకు పోలీసు వ్యవస్థలో భారీ మార్పులు వచ్చాయని అన్నారు. పోలీసు అధికారులు గ్రామాల్లో సందర్శించిన సమయంలో సమస్యలపై ఆరా తీయాలని జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. సమస్యలను ప్రారంభంలోనే గుర్తించినట్లయితే నేరాలను అదుపు చేయవచ్చని అన్నారు. సత్వర పోలీసు సేవలు వినియోగించుకోవలంటే టోల్ ఫ్రీ నెంబర్లు 100, 1090, 1098 లను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుల విభాగం అధికారులు శివాజి చౌహన్, జైస్వాల్ కవిత, ఎం.డి రియాజ్, ఎస్పీ సిసి రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కుశ్నపల్లిలో విద్యార్థిని అదృశ్యం బెజ్జూర్, ఏప్రిల్ 20: మండలంలోని కుశ్నపల్లి గ్రామంలో ఓ విద్యార్థిని అదృశ్యమైంది. కుశ్నపల్లి గ్రామానికి చెందిన నికాడి సునిత(14)అనే 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ నెల 3న ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవతో మనస్థాపం చెంది అదృశ్యమైనట్లు సునీత తండ్రి గుండయ్య బెజ్జూర్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశాడు. గుండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పున్నంచందర్ తెలిపారు.