(12 Apr) ఫెర్టిలైజర్‌సిటీ: ఒకే రిజిస్ట్రేషన్‌తో నడుస్తున్న రెండు ప్రైవేట్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో ఖమ్మం జిల...
(12 Apr) ఫెర్టిలైజర్‌సిటీ: ఒకే రిజిస్ట్రేషన్‌తో నడుస్తున్న రెండు ప్రైవేట్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో ఖమ్మం జిల్లా కొత్తగూడెంతో పాటు కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో రవాణా శాఖాధికారులు పోలీసుల సాయంతో విస్తృత తనిఖీలు చేపట్టి మూడు బస్సులను ఏకకాలంలో సీజ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఏపీ 02యూ-0414 రిజిస్ట్రేషన్ నంబర్ ఓ ప్రైవేట్ బస్సు కొత్తగూడెంలో తిరుగుతోంది. అదే రిజిస్ట్రేషన్ నంబర్‌తో మరో బస్సు గోదావరిఖనిలోనూ నడుస్తోంది. సమాచారం అందుకున్న ఆర్టీఏ అధికారులు భూపాలపల్లి నుంచి వస్తున్న ఇక్కడి బస్‌ను జీడీకే-11ఏ గని సమీపంలో గురువారం రాత్రి సీజ్ చేశారు. కొత్తగూడెం ఆర్టీఏ అధికారులు అక్కడి బస్సును సీజ్ చేశారు. ఇక్కడ సీజ్ చేసిన బస్సు చాసిస్ నంబర్‌తో తనిఖీలు చేయగా ఏపీ16డబ్ల్యూ 2233 నంబర్ గల బస్సు చాసిస్ నంబర్ అని తేలింది. దీంతో మూడు బస్సులను ఏకకాలంలో సీజ్ చేశారు. ఇక్కడ సీజ్ అయిన రెండు బస్సులను గోదావరిఖని బస్సు డిపో ఆవరణలో ఉంచా రు. బాధ్యులపై రామగుండం ఎంవీఐ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సహాయంతో నిర్వహించిన తనిఖీల్లో కరీంనగర్ ఆర్టీఏ వినోద్‌కుమార్, పెద్దపల్లి ఎంవీఐ లింగమూర్తి, రామగుండం ఎంవీఐ శ్రీనివాస్, కొత్తగూడెం ఎంవీఐ ఈశ్వర్‌సింగ్ పాల్గొన్నారు.