హైదరాబాద్, ఏప్రిల్ 3: శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా మాదిరిగానే శోభాయాత్రను నిర్వహించేందుకు బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత...
హైదరాబాద్, ఏప్రిల్ 3: శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా మాదిరిగానే శోభాయాత్రను నిర్వహించేందుకు బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్‌ల సంయుక్త్ధ్వార్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి గిన్నిస్ రికార్డు సాధించేందుకు దాదాపు లక్ష బైక్‌లతో శనివారం ఈ శోభాయాత్రను నిర్వహించనున్నారు. గౌలీగూడ హనుమాన్ దేవాలయం నుంచి మొదలై కోఠి, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసి క్రాస్‌రోడ్డు, అశోక్‌నగర్, గాంధీనగర్, పద్మశాలికాలనీ, కవాడిగూడ, బైబిల్ హౌజ్, ప్యారడైజ్ల మీదుగా తాడ్బన్ శ్రీ హనుమాన్ దేవాలయం వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. యాత్ర ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలకు ప్రతీకగా జరిగేందుకు వీలుగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. యాత్ర కొనసాగే ప్రాంతాల్లో ఆంక్షలను అమలు చేయటంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం మొత్తం యాత్రను వీడియో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. అంతేగాక, ఎన్నడూ లేని విధంగా ఈ సారి జోన్ల వారీగా పటిష్టమైన భద్రతకు పోలీసు వ్యవస్థ ప్రణాళిక రచించింది. గత అనుభవాల నేపథ్యంలో అడుగడుగురానా సిసి కెమెరాలు, మొబైల్ కెమెరాలను బిగించి, ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఉన్నతాధికారులు యాత్ర దృశ్యాలను, పాల్గొన్న ప్రతి ఒక్కరి కదలికలను పరిశీలించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలు, సాయుధ దళాలను రంగంలో దించారు. యాత్ర కొనసాగే వివిధ రద్దీ ప్రాంతాలు, కూడళ్లలో శుక్రవారం మధ్యాహ్నం నుంచే పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సున్నితమైన, సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బ్యారికేడ్లను ఏర్పాటు చేసి సాధారణ ట్రాఫిక్‌ను దారి మళ్లించేందుకు ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం వీది లైట్లు వంటివి ఏర్పాటు చేయాలని ఇప్పటికే జిహెచ్ఎంసి కమిషనర్ సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. అంతేగాక, యాత్ర మార్గంలో ఎక్కడా కూడా ఇరువైపులా భవన నిర్మాణ సామాగ్రి, కాంక్రీట్ ఉండరాదని, ఒక వేళ ఉన్నా, దాన్ని తొలగించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో మధ్యాహ్నం జరిగే బహిరంగ సభ నేపథ్యంలో 300 మంది పోలీసులను ప్రత్యేకంగా మోహరించారు. అఖిల భారతీయ బజరంగ్దళ్ ప్రముఖ్ రాజేశ్ పాండే, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు హజరుకానున్న నేపథ్యంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. హనుమజ్జయంతికి ముస్తాబైన ఆలయాలు సికింద్రాబాద్: కంటోనె్మంట్, సికింద్రాబాద్ ప్రాంతాలలోని హనుమాన్ దేవాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. దేవాలయాలను పలురకాల పూలతో కన్నుల పండవగా తీర్చిదిద్దారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో దేవాలయాలు విశేషలంకారణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి. తాడుబందు వీరాంజనేయ స్వామి ఆలయం, బోయిన్‌పల్లిలోని కంసారి బజారులోని సీతారామాలయం, హస్మత్‌పేట్‌లోని అభయాంజనేయ స్వామి ఆలయం, ఓల్డ్ బోయిన్‌పల్లిలోని రాములవారి దేవాలయం, రామమందిరం, పెద్దతోకట్టలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, చిన్నతోకట్టలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం, నందమూరినగర్‌లోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, చిలకలగూడలోని వీరాంజనేయస్వామి ఆలయం, నామాలగుండులోని వీరాంజనేయస్వామి అలయం, బీదలబస్తీలోని హనుమాన్ దేవాలయం, పద్మారావునగర్‌లోని పోలుబాగ్ ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శనివారం జరిపే హనుమజ్జయంతి సందర్భంగా తెల్లవారు జామున చతుర్దశ మూన్యుసూక్త అభిషేకాలు, అనంతరం స్వామి వారికి సింధూరలంకరణ, విశ్వరూప అలంకరణ, వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. స్వామివారికి మూల మంత్రం, వేదపారాయణం, సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలు ఏర్పాటు చేశారు. భక్తులకు క్యూలైన్లు ఏర్పాటు చెయ్యడంతో పాటు భక్తులకు పంచేందుకు పులిహోర ప్రసాదం ఏర్పాటు చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటల వరకే స్వామి దర్శనాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
