-రైల్వే ప్రయాణికులకు అందుబాటులో ఇంటర్నెట్ సేవలు -వారంరోజుల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అమలు రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ...
-రైల్వే ప్రయాణికులకు అందుబాటులో ఇంటర్నెట్ సేవలు
-వారంరోజుల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అమలు
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వారం రోజుల్లో వైఫై సౌకర్యం అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైలు ప్రయాణంలో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని మూడు సంవత్సరాల క్రితమే రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్నది. ఇందుకు గాను కేయూ బ్యాండ్ ట్రాన్స్ఫౌండర్ నుంచి తగిన ఫ్రీక్వెన్సీని పొందడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నుంచి 2012లో అనుమతులు పొందింది. అయితే ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయిలో విస్తరించాలనుకున్నది. ఇందులో భాగంగా అధికారులు మొదటి ఆరు స్టేషన్లలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేసి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్లో వైఫై సౌకర్యం సెల్‌ఫోన్‌కు అరగంట పాటు అందుబాటులో ఉంటుంది. ఈ వ్యవధి తర్వాత నెట్వర్క్ నిలిచిపోతుంది. గ్రేటర్‌లోని కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలోనూ వైఫై ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
