(10 Apr) ధర్మాపురం : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. ఈ సంఘటన శుక్రవారం కరీ...
(10 Apr) ధర్మాపురం : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. ఈ సంఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా ధర్మాపురం మండలం కొత్తూరు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కొత్తూరు గ్రామానికి చెందిన నితిన్, మౌనికలు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని మౌనిక నితిన్‌ను కోరగా అతను ముఖం చాటేశాడు. దీంతో ఆమె శుక్రవారం ప్రియుడి ఇంటిముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న నితిన్, అతని తల్లిదండ్రులు ఇంటి నుంచి జారుకున్నారు. కాగా నితిన్ పెళ్లి చేసుకునే వరకు వదిలేది లేదని, అవసరమైతే అతని ఇంటిముందే ఆత్మహత్య చేసుకునేందుకు వెనుకాడనని ప్రియురాలు చెబుతోంది. విషయం తెలిసిన మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలిచాయి.