(8 Apr) *వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దండేపల్లి, ఏప్రిల్ 7: ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ అసుప్రతులలో వైద్య సేవలు అందిస్తామని ర...
(8 Apr) *వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
దండేపల్లి, ఏప్రిల్ 7: ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ అసుప్రతులలో వైద్య సేవలు అందిస్తామని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. దండేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ అసుపత్రిని మంగళవారం దేవాధాయ శాఖ మంత్రి ఐకెరెడ్డి, ఎంపి సుమన్‌లతో కలిసి మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అసుప్రతిలోని అపరేషన్ గది, పేషేంటు గదులను, మందులను మంత్రి పరిశీలించారు. వైద్యం కోసం వచ్చిన చిన్నారిని పరిక్షించారు. ఈ సందర్భంగా అసుపత్రి అవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కార్పోరేట్ అసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కృత నిచ్చయంతో ఉందన్నారు. దండేపల్లి అసుపత్రిని ఆరు పడుకల నుంచి 30 పడుకలకు పేంచుతున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తానన్నారు.