(15 Apr) భారీ వర్షానికి పొంగిన డ్రైనేజీలు, నాలాలు లోతట్టు ప్రాంతాలు, బస్తీల్లోకి వరద నీరు ఈదురు గాలులకు విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభ...
(15 Apr) భారీ వర్షానికి పొంగిన డ్రైనేజీలు, నాలాలు లోతట్టు ప్రాంతాలు, బస్తీల్లోకి వరద నీరు ఈదురు గాలులకు విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు నీరు నిలిచి చిత్తడిగా రహదారులు..మంగళవారం 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ శాఖ
కాల వర్షాలు నగర జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటుచూసినా పొంగిపొర్లే డ్రైనేజీలు, నాలాలు, చెరువులను తలపిస్తున్న రహదారులు... నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు నగరంలో వర్ష భీభత్సాన్ని కళ్లకు కడుతున్నాయి. మంగళవారం కూడా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు 3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయిందని, రాబోయే 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు.. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షం నీరు ప్రవేశించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్న కొద్దిపాటి ఇంటిలోకి భారీగా వరద నీరు చేరడంతో కంటి మీద కునుకు తీయలేని దుస్థితి నెలకొంది. చిన్న పిల్లలు ఉన్న కుటుంబాల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సికింద్రాబాద్, కంటోన్మెంట్, ముషీరాబాద్, హిమాయత్‌నగర్, పాతబస్తీ, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, అంబర్‌పేట, బాగ్ అంబర్‌పేట, నల్లకుంట, గోల్నాక, విద్యానగర్, కాచిగూడ, బర్కత్‌పుర డివిజన్లలోని బస్తీలను వరదనీరు ముచ్చెత్తింది. ఛే నెంబర్, బర్కత్‌పుర, శివంరోడ్డు, బతుకమ్మకుంట, తిలక్‌నగర్ రైల్వేబ్రిడ్జి తదితర ప్రధాన రహదారులపై మోకాలిలోతు నీరు నిలవడంతో వాహనాదారులు ఇబ్బందులకు గురయ్యారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రధాన రహదారులలో వర్షం నీరు నిలిచిపోయి ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. మొజాంజాహి మార్కెట్ చౌరస్తా, పుత్లిబౌలి వెళ్లే ప్రధాన రహదారిలో వర్షం నీరు నిలిచి పోయింది. వాహనదారులు నానా ఇబ్బందుల పాలయ్యారు. మొజాంజాహి మార్కెట్‌లోని ఎంసీహెచ్ కాంప్లెక్స్ వర్షం నీటితో నిండిపోయింది. దీంతో వ్యాపారులు దుకాణాలలోకి వర్షం నీరు చేరడంతో దుకాణదారులు నీటిని తోడి పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ అధికారులు మోటార్లను బిగించి జీహెచ్‌ఎంసీ కాంప్లెక్స్ నుంచి నీటిని తోడాల్సి వచ్చింది. మొజాంజాహి మార్కెట్ నుంచి పుత్లిబౌలి రహదారిలో మెట్రో రైలు పనులు జరుగుతున్న మార్గంలో రహదారులు అస్తవ్యస్తంగా మారడంతో పాటు చిత్తడి చిత్తడిగా మారాయి. ప్రధాన రహదారులతో పాటు నియోజకవర్గం పరిధిలోని మురికి వాడలలో వర్షం నీటితో రహదారులన్ని చిత్తడి చిత్తడిగా మారాయి. సూర్యమహల్, జుమ్మెరాత్‌బజార్, మంగళ్‌హాట్, ఇందిరానగర్, గుఫానగర్, ధూల్‌పేట్ తదితర ప్రాంతాలలో వర్షంతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. పాతబస్తీలోని మొగల్‌పుర, భవానీనగర్, తలాబ్‌కట్టా, ఛత్రినాఖ, శివగంగానగర్, గంగానగర్ నాలలతోపాటు లోతట్టు ప్రాంతాలు సైతం మంగళవారం రాత్రి కరిసిన భారీ వర్షానికి జలమయ్యాయి. కరెంటు తీగ కాటేసింది.. ఈదురుగాలులకు తెగి నాలాలో పడిన విద్యుత్ తీగ చెత్తకాగితాలు ఏరుకోబోయి షాక్‌గురై ఇద్దరు మృతి చందానగర్, ఏప్రిల్ 14: నాలాలో చెత్త కాగితాలను ఏరుకునేందుకు వెళ్లిన ఇద్దరిని కరెంట్ షాక్ రూపంలో మృత్యువు కబలించింది. ఈ సంఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దొబ్బచెర్ల గ్రామానికి చెందిన కలేమ రాములమ్మ తన భర్త జమ్మయ్య ఇటీవల మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో అతినితో గొడవ పడి తన కుమారుడు లక్ష్మన్ రాజు అలియాస్ లక్షయ్య(18)ను తీసుకుని కొన్ని రోజుల క్రితం మియాపూర్ లక్ష్మీనగర్ గుడిసెల్లో నివాసం ఉంటున్న మరిది యాదగిరి వద్దకు వచ్చింది. యాదగిరి చెల్లెలు కొడుకు అదే గ్రామానికి చెందిన కలేమ సోమరాజు(12) తల్లితండ్రులు ఇరువురు చనిపోవడంతో మేనమామ యాదగిరి వద్దే ఉంటున్నాడు. వరుసకు బావాబావమరుదులు అయిన లక్ష్మయ్య, సోమరాజులు చిత్తు కాగితాలు, స్క్రాబ్ ఏరుకుని జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఆల్విన్ కాలనీ ఎదురుగా ఉన్న నాలాలో చెత్త ఏరుకుందామని కాలువలోకి దిగారు. రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడే చెట్టును ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభం కరెంటు తీగ తెగి నాలాలో పడి ఉంది. ఇది గమనించని ఇద్దరు నాలాలో దిగడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. తెగిపడిన విద్యుత్ తీగలను సకాలంలో అధికారులు గుర్తించకపోవడం వల్లే ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.