-టీఆర్ఎస్ బహిరంగసభ నేపథ్యంలో ఫలితాల విడుదలపై అనిశ్చితి -27న ఐఐటీ-జేఈఈ మెయిన్స్ ఫలితాలు: సీబీఎస్ఈ హైదరాబాద్ : రాష ఇంటర్మీడియట్ సెక...
-టీఆర్ఎస్ బహిరంగసభ నేపథ్యంలో ఫలితాల విడుదలపై అనిశ్చితి
-27న ఐఐటీ-జేఈఈ మెయిన్స్ ఫలితాలు: సీబీఎస్ఈ
హైదరాబాద్ : రాష ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్ష ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. సోమవారం టీఆర్ఎస్ పార్టీ బహిరంగసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఫలితాలను ఆదివారం విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఫలితాల వెల్లడికి విద్యాశాఖ మంత్రి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తుది ఆమోదం తెలుపాల్సి ఉంది. అనివార్య పరిస్థితుల్లో ఆదివారం ఫలితాలు విడుదల కాకపోతే సోమవారం మధ్యాహ్నం కల్లా విడుదల చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వర్గాలు తెలిపాయి. సెకండియర్ పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించిన పనులు ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఆదివారం, సోమవారాలలో వీలుపడకపోతే మంగళవారం ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్మీడియట్ బోర్డు వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం వరకు కూడా ఫలితాల వెల్లడిపై అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం వెలువడలేదు. ఇదిలా ఉండగా, ఐఐటీ-జేఈఈ మెయిన్స్ ఫలితాలు సోమవారం ఉదయం విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.