(11 May) -ఉదయం 10 నుంచి ఒంటి గంట దాకా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష -నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ -అపరాధ రుసుంతో ఈ నెల 12 వరకు ఫీజు చెల్ల...
(11 May) -ఉదయం 10 నుంచి ఒంటి గంట దాకా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష
-నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ
-అపరాధ రుసుంతో ఈ నెల 12 వరకు ఫీజు చెల్లించే అవకాశం - రాష్ట్ర కన్వీనర్ ఎన్వీ రమణారావు
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఈ నెల 14న ఎంసెట్-2015 (ఇంజినీరింగ్ అండ్ మెడిసిన్) నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంసెట్-2015 (జెఎన్టీయూ) కన్వీనర్ ఎన్వీ రమణారావు, కో కన్వీనర్ జీకే విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీ జీ కళాశాలలో పరీక్ష పరిశీలకులకు నిర్వహించిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కరీంనగర్ రీజినల్ కో ఆర్డినేటర్ (కరీంనగర్) టీ పాపారావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎంసెట్ రాసే విద్యార్థులు సమయానికి గంట ముందే ప రీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ని మిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చే శారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మెడిసిన్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. జిల్లా కేం ద్రంలో, శివారులో కలిపి ఇంజనీరింగ్ విద్యార్థులకు 25 పరీక్ష కేంద్రాలను, మెడిసిన్ విద్యార్థుల కోసం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో ఇంజనీరింగ్ ప రీక్షకు 11,966 మంది, మెడిసిన్‌కు 5,816 మం ది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ముగిసినప్పటికీ ఈ నెల 12లోపు రూ. 10,000 అపరాధ రుసుంతో ఫీ జు చెల్లించవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న అ భ్యర్థులు హాల్‌టికెట్లను www.tseamcet.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రతి సెంటర్‌కు ఒక పరిశీలకుడు, 24 మంది అ భ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్, 500 మందికి ఒక అబ్జర్వర్ ఉంటారని పేర్కొన్నారు. రీజినల్ సెంటర్‌కు ఒక ప్రత్కేక పరిశీలకుడు ఉంటారని తెలిపా రు. ఒక్కో విద్యార్థి ఎన్నిసాైర్లెనా ఎంసెట్ పరీక్ష రా యవచ్చని, ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెవిలో ఇముడ్చుకునే పరికరాలు, వాచిలు, పెన్నులలో వాయిస్ రికార్డర్లు, కెమెరాలు పరీక్షా కేంద్రానికి తీసుకువస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు అ మ లు చేస్తామన్నారు.ఒకటికి మించి ఎంసెట్ పరీక్ష రాసే వారిపై గట్టి నిఘా ఉంటుందని అన్నారు. ప రీక్షా సమయానికి ముందే టాయిలెట్‌కు వెళ్లి రా వాలని సూచించారు. పరీక్షా సమయంలో టా యిలెట్కు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ కేసుల్లో సడలింపు ఉంటుందని, అటువంటి వారికి అటెండెంట్ తోడుగా ఉంటారని వివరించారు. ఇన్విజిలేటర్లు, ఆబ్జర్వర్ల పిల్లలు, బంధువుల పిల్లలు ఎంసెట్ పరీక్ష రాస్తే వారు విధులకు దూరంగా ఉండాలని అన్నారు. ఇందుకు సంబంధించి వారి నుంచి ప్రమాణ పత్రాలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 16న ప్రిలిమినరి కీ విడుదల చేస్తామని, 23వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. ఈ నెల 28న ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. ఎంసెట్ ఫలితాల్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజి ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఇంకా ఏమైనా సందేహాలుంటే వెబ్సైట్ సందర్శించాలని రమణారావు సూచించారు. ఎంసెట్ రాసేవారికి సూచనలు.. lఎంసెట్ పరీక్షా రాసే ప్రతి అభ్యర్థి హాల్‌టికెట్‌తో రావాలి. హాల్టికెట్లేని అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. l సెల్ ఫోన్లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. l ప్రతి పరీక్షా కేంద్రానికి (గదులలో) గోడ గడియారం ఉంటుంది. l ఇంజినీరింగ్ విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. l మెడిసిన్ విద్యార్థులను మధ్యాహ్నం 1.30 గం టల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
