గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఓ సింగరేణి కార్మికుడి ఇంట్లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఈ సంఘటనలో రూ.2 లక్...
గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఓ సింగరేణి కార్మికుడి ఇంట్లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఈ సంఘటనలో రూ.2 లక్షలు, రూ.5 లక్షలకు పైగా విలు వ చేసే బంగారం, వెండి ఆభరణాలను దుండగులు దొంగిలించారు. వారు వాటిని మరో దాబాపై వదిలేసి పరారయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. సింగరేణి ఓసీపీ-3లోజనరల్ మజ్దూర్‌గా పనిచేసే కుమ్మరి నారాయణ, మార్కండేయ కాలనీలో ఉంటున్నాడు. సోమవారం రాత్రి ఇంటిల్లిపాది వేర్వేరు గదుల్లో పడుకున్నా రు. ఈక్రమంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువా తాళం చెవులను తీసుకున్నారు. దర్జాగా బీరువా తెరిచి, రూ.2లక్షలు, 8 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, ఇంట్లో ఉంచిన సెల్‌ఫోన్ ఛార్జర్‌ను దొంగిలించారు. అనంతరం ఆ ఇంటి పక్కనే ఉన్న న్యాయవాది ఇంటి దాబా బాల్కనీ నుంచి పైకి వెళ్లారు. చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలు, బీరువా తాళం చెవులను దాబాపై పెట్టి, న్యాయవాదికి చెందిన చెప్పులతో ఉడాయించారు. ఈ క్రమంలో దాబాపైకి వెళ్లిన న్యాయవాది చూసేసరికి వెండి, బం గారు ఆభరణాలు మూట కట్టిన ఓ వస్త్రం, బీరువా తాళంచెవి కనిపించింది.
కాగా, ప్రతి రోజూ సెల్‌ఫోన్ లో అలారం పెట్టుకుని నిద్రించే నారాయణ భార్య పోచమ్మ, అది మోగకపోవడంతో అనుమానం వచ్చి లేచింది. సెల్‌ఫోన్‌తో పాటు బీరువాలో నగలు, నగదు కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు తెలుసు కుంది. బీరువాలను పరిశీలించగా, 8తులాల బంగా రు, వెండి ఆభరణాలు, రూ.2లక్షలు కనిపించలేదు. న్యాయవాది సైతం ఆభరణాల విషయాన్ని స్థానిక వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆభరణాల కోసం ఆరా తీశారు. ఈ చోరీ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. చోరీకి వచ్చిన దుండగులు బీరువా తాళంతో పాటు బంగారు, వెండి ఆభరణాలను ఒక ఇంట్లో చోరీ చేసి మరో ఇంట్లో వదిలి వెళ్లడం, చెప్పులు చోరీ చేయ డం ఏమిటన్నది అర్థంకావడం లేదు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, నిందితులను పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు.