(3 May) హైదరాబాద్ : హైదరాబాద్కు భౌగోళికంగా ఎన్నో అనుకూలతలు ఉన్నాయని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) అడిషనల్ డ...
(3 May) హైదరాబాద్ : హైదరాబాద్కు భౌగోళికంగా ఎన్నో అనుకూలతలు ఉన్నాయని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) అడిషనల్ డైరెక్టర్ ప్రొఫెసర్ కే తిరుపతయ్య అన్నారు. టీఆర్ఎస్ శిక్షణ తరగతుల్లో భాగంగా గ్రీన్ కవర్-పర్యావరణం-అడవులు, ప్రకృతి వైపరీత్యాలు అనే అం శంపై ఆయన ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, హరితహారాన్ని పర్యావరణ అవగాహన కార్యక్రమంగా అమలు చేయాలన్నారు. విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. ఇక్కడ నల్లరేగడి, ఎర్రనేలలు, చవుడు నేలలున్నాయని, అందుకే ఇక్రిశాట్ను హైదరాబాద్లో పెట్టారని తెలిపారు. గత 50 ఏండ్లలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, దీనివల్ల వర్షాభావం ఏర్పడుతుందన్నారు. మంచినీటి ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయని, అడవుల్లోని జీవ వైవిధ్యం దెబ్బతింటున్నదని హెచ్చరించారు. -తెలంగాణలో భూసారాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలి -ప్రొఫెసర్ కే తిరుపతయ్య వ్యవసాయానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తిరుపతయ్య చెప్పారు. అయితే ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉందని ఆయన అన్నారు. కరువును ఎదుర్కొనే విధంగా మన ప్రణాళికలు తయారుకావాలని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భూసారాన్ని పెంచే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. అటవీ ప్రాంతాల్లో కూడా చెట్లు ఉండటం లేదన్నారు. పట్టణ ప్రాంతాలు, అటవీయేతర ప్రాంతాల్లో విరివిగా చెట్లు పెంచాలన్నారు. పట్టణాల్లో మురుగునీటి వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయన్నారు. పట్టణాల్లో వాయు కాలుష్యం కూడా పెరుగుతున్నదన్నారు. డాక్టర్ ప్రసన్న ఇవే అంశాలపై మరికొంత వివరణ ఇచ్చారు. ప్రకృతిని కాపాడుకోవటం, మురుగునీటి నిర్వహణ, నీటి నిల్వ పద్ధతులపై, సమర్థ నీటి నిర్వహణపై డాక్టర్ సాయిభాస్కర్ వివరించారు.