కార్మిక రంగ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ అన్నారు. మేడే ఉత్సవాల సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కార...
కార్మిక రంగ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ అన్నారు. మేడే ఉత్సవాల సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కాంట్రాక్టు కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కార్మికులు ఎంపికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించే దిశగా తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి చికాగోలో ఎంతోమంది కార్మికులు అమరులయ్యారని, అమరుల స్పూర్తిగా మేడేను కార్మికులు జరుపుకుంటున్నారని అన్నారు. కార్మిక రంగ సమస్యలపై పోరాటాలు చేసి హక్కులు సాధించుకున్నారని అన్నారు.
