-ఉద్యోగుల విభజనలో జాప్యానికి కేంద్రమే కారణం: విఠల్ నిజామాబాద్ : ముప్ఫై ఏండ్లకు కావాల్సిన ఉద్యోగులను భర్తీ చేసే క్రమంలో టీఎస్పీఎస్సీ...
-ఉద్యోగుల విభజనలో జాప్యానికి కేంద్రమే కారణం: విఠల్
నిజామాబాద్ : ముప్ఫై ఏండ్లకు కావాల్సిన ఉద్యోగులను భర్తీ చేసే క్రమంలో టీఎస్పీఎస్సీ చిత్తశుద్ధితో పనిచేస్తదని, ఆరోపణలకు, పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా నియమకాలు చేపడుతామని టీఎస్పీఎస్సీ సభ్యుడు, తెలంగాణ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకుడు సీ విఠల్ పేర్కొన్నారు. ప్రతిభకే పట్టం కడుతామన్నారు. ఆదివారం నిజామాబాద్లో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల విభజనలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యమే నోటిఫికేషన్ల విడుదలకు ప్రతిబంధకంగా మారిందన్నారు. కమల్నాథన్ కమిటీ ఇప్పటికీ ప్రక్రియను పూర్తి చేయలేకపోయిందని అసహనం వ్యక్తంచేశారు. అందువల్లే రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నదన్నారు.
Key Tags
Recruiting talent
