(12 May)మంచిర్యాల :సింగరేణి సంస్థలో రిటైర్డ్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. నౌకరీ ఉన్నన్ని రోజులు మంచి వేతనాలు అందుతున్నా ఉద్యోగ ...
(12 May)మంచిర్యాల :సింగరేణి సంస్థలో రిటైర్డ్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. నౌకరీ ఉన్నన్ని రోజులు మంచి వేతనాలు అందుతున్నా ఉద్యోగ విరమణ తర్వాత సరైన పింఛన్ లభించక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. గడిచిన 15 ఏళ్లుగా.. గడిచిన 15 ఏళ్లుగా సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్‌లో ఎలాంటి ఎదుగూబొదుగూ లేదు. ఫలితంగా వందలాది మందికి నెలకు కనిష్ఠంగా కేవ లం 300 మాత్రమే పెన్షన్ దక్కుతోంది. ఇం దుకు సంస్థ యాజమాన్యం, కేంద్రప్రభుత్వ తీరే కారణం. ఐదో వేజ్‌బోర్డు కాలం నుంచి గడిచిన 15 ఏళ్లుగా సంస్థ యాజమాన్యం ఒక్కో కార్మికుడి తరుపున నెలకు 69(అప్పటి ఇంక్రిమెంట్ ఆధారంగా లెక్కించిన మొత్తం) మాత్రమే పెన్షన్ ఫండ్‌కు చెల్లిస్తున్నది. కార్మికుడి బేసిక్ వేతనం నుంచి మాత్రం నెలనెలా రెండు శాతం పెన్షన్ ని ధికి జమ అవుతోంది. సింగరేణిలో కనీస బేసిక్వేతనం 16వేలుగా ఉంది. ఇందులో 2శాతం అం టే, కనిష్ఠంగా ప్రతి కార్మికుడు 320 చెల్లించాల్సి వస్తోంది. ఎక్కువ బేసిక్ వేతనం ఉన్న కార్మికుడి నుంచి ప్రతి నెలా 1500 దాకా జమ అవుతోం ది. ఇంత భారీ మొత్తంలో జమ చేస్తున్నా రిటైర్డ్ అయ్యాక మాత్రం తక్కువ పెన్షన్ వస్తున్నది. ప్రస్తు తం సింగరేణిలో బేసిక్‌పై 3శాతం ఇంక్రిమెంట్ చె ల్లిస్తున్నారు. ఈ లెక్కన కనీస బేసిక్ 16వేలపై 3 శాతం అంటే తక్కువలో తక్కువ 480 చొప్పు న నెలనెలా కార్మికుడి పెన్షన్ నిధికి జమ చేయాలి. కానీ అలా చేయకపోవడం వల్ల ఆ ప్రభావం పెన్షన్‌పై పడుతున్నది. కేంద్రానిదీ అదే తీరు.. సంస్థ తీరు ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూ డా పదేళ్ల కిందటి 1600ను కనీస వేతనం గా తీసుకొని 7/6 శాతం మొత్తాన్ని పెన్షన్ నిధికి జమచేస్తున్నది. అంటే ఇప్పటికీ ప్రతి కార్మికుడికి నెలనె లా కేవలం 18.66పైసలు మాత్రమే జ మ చేస్తున్నది. ప్రస్తుతం కనీస వేతనం 10వేలకు చేరినా ఆ మేరకు వాటా పెంచడం లేదు. నేటికీ 25శాతమే! బొగ్గు గని కార్మికులకు ప్రస్తుతం 25శాతం పెన్షన్ మాత్రమే లభిస్తోంది. ప్రతి మూడేళ్లకోసారి సవరించాల్సి ఉన్నా 15 ఏళ్లుగా ఆ ఊసే ఎత్తడం లేదు. దిగిపోయేటప్పుడు ఉన్న వేతనంలో కనీసం 40 శాతాన్ని పెన్షన్‌గా చెల్లించాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నా, పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం చెల్లించే వాటా పెంచకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 50 శాతం పెన్షన్, పెరిగిన డీఏను ఎప్పటికప్పుడు వర్తింపజేస్తున్నారు. ఉదాహరణకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రిటైర్డయితే అప్పటికి ఉన్న మూలవేతనంపై 50 శాతం వేతనం పెన్షన్ ఇస్తారు. కానీ నల్లసూర్యులకు గరిష్ఠంగా 25 శాతమే వస్తుండడంతో రిటైర్డ్ కార్మికులు కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది పొట్టకూటి కోసం కూలి పనులకు పోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, బొగ్గు గని కార్మికుల పెన్షన్ సమస్యను పరిష్కరించాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
