- ప్రభుత్వం నిర్ణయం.. త్వరలో ఉత్తర్వులు హైదరాబాద్ : రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాల డీలర్ల కమీషన్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వర...
- ప్రభుత్వం నిర్ణయం.. త్వరలో ఉత్తర్వులు
హైదరాబాద్ : రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాల డీలర్ల కమీషన్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో దీనికి సంబందించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. కమీషన్ తక్కువగా వస్తున్నందున డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం గ్రహించింది. గత ప్రభుత్వాలు అమలు చేసిన కమీషన్.. రేషన్ డీలర్ల కుటుంబ అవసరాలకు సరిపోవడంలేదని, ఆదాయం సరిపోక సబ్సిడీ బియ్యంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలుసుకుంది.
పేదలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పట్టకుండా ఉండాలంటే డీలర్లకు కమీషన్ పెంచాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖలో పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు బియ్యం క్వింటాలుకు పట్టణ ప్రాంతంలో రూ.25, గ్రామీణ ప్రాంతంలో రూ.20 కమీషన్ ఇస్తున్నది. దీనిని రూ.70 నుంచి రూ.80 వరకు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. ఇక చక్కెర విక్రయం ద్వారా కిలోకు 14 పైసలు, కిరోసిన్‌పై లీటరుకు 25 పైసలు మాత్రమే డీలర్లకు కమీషన్ వస్తుంది. దీంతో డీలర్లు తప్పనిసరి పరిస్థితుల్లో అక్రమాలకు పాల్పడతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. కమీషన్ పెంపునకు నిర్ణయం తీసుకుంది.
అయితే రేషన్ డీలర్లు మాత్రం తమిళనాడు తరహాలో జీతం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి కమీషన్‌ను మాత్రమే పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు డీలర్లందరికీ సమానంగా రేషన్ కార్డులు ఉండేలా చర్యలు తీసుకోనుంది. కొంతమంది డీలర్లకు ఎక్కువ రేషన్ కార్డులు, మరికొందరికి తక్కువ కార్డులు ఉన్నాయి. దీంతో కార్డులు తక్కువగా ఉన్న డీలర్లకు పూట గడవడం కూడా కష్టంగా మారింది. దీనిని రద్దుచేసి కార్డులను రేషనలైజ్ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.
Key Tags
Commission to increase , the ration dealers!
