పాదయాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం రాహుల్ నడక వేగాన్ని అందుకోలేకపోయిన నేతలు అందరితోనూ కలసిపోయిన యువనేత పరిణతి ప్రదర్శించారని రాష్...

పాదయాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
రాహుల్ నడక వేగాన్ని అందుకోలేకపోయిన నేతలు
అందరితోనూ కలసిపోయిన యువనేత
పరిణతి ప్రదర్శించారని రాష్ర్ట నేతల విశ్లేషణ
నిర్మల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర, ప్రసంగం సందర్భంగా రాహుల్‌గాంధీ వ్యవహరించిన తీరు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. పార్టీకి ఇక మంచి రోజులు వచ్చినట్టేనని నేతలంటున్నారు. ఎస్పీజీ రక్షణ వలయంలో ఉన్నా.. ప్రజలకు చేరువయ్యేందుకు రాహుల్ వీలైనంతగా ప్రయత్నించారు. ఆద్యంతం ఆడంబరాలకు దూరంగా వ్యవహరించారు. శుక్రవారం ఉదయం 8.30కు కొరటికల్(మామడ మండలం) గ్రామంలో పాదయాత్ర ప్రారంభమైంది.
ఆత్మహత్య చేసుకున్న రైతు వెల్మ రాజేశ్వర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. టీపీసీసీ తరఫున 2 లక్షల చెక్కును అందించారు. కొరటికల్ గ్రామం దాటేదాకా భద్రతా కారణాలరీత్యా కారులోనే ప్రయాణించారు. గ్రామ పొలిమేర దాటగానే నడక ప్రారంభించారు. లక్ష్మణచాంద గ్రామంలో ఆత్మహత్యలకు పాల్పడిన బొండ్ల లింగన్న, సూది లస్మన్న కుటుంబసభ్యులనూ పరామర్శించి పార్టీ సాయం అందించారు. పొట్టుపల్లి గ్రామంలో మహిళా బృందాల సభ్యులను పలకరించారు. రాచాపూర్‌లో సాతం గంగాధర్, వడ్యాలలో పసుపుల లక్ష్మణ్ కుటుంబసభ్యులను పరామర్శించి చెక్కులను అందించారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వడ్యాల గ్రామంలో పాదయాత్ర ముగిసింది.
రాహుల్ స్పీడు..
రాహుల్ నడక వేగంగా సాగింది. ఆయన్ను అందుకోలేక టీపీసీసీ నేతలు ఒక్కోసారి పరుగులు పెట్టాల్సి వచ్చింది. దారి మధ్యలో స్థానిక పరిస్థితుల గురించి రాహుల్ అక్కడి నేతలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల ఎక్కడికక్కడ రోడ్డు పక్కన ఇళ్లపెకైక్కి రాహుల్‌ని చూడటానికి పోటీ పడ్డారు. పాదయాత్ర ఆసాంతం రాహుల్ చూపించిన ఓపిక, నిరాడంబరత స్థానికులను ఆకట్టుకుంది. ఆయన్ను కలవడానికి పలువురు ప్రయత్నించినా భద్రతా కారణాలరీత్యా వీలుకాలేదు. పాదయాత్రతో రాహుల్ బట్టలు దుమ్ముకొట్టుకునిపోయాయి.
వడ్యాలలో యాత్ర ముగిసిన తర్వాత అక్కడే ఓ ఇంట్లో స్నానం చేసి రెండున్నర గంటలపాటు విశ్రాంతి తీసుకున్నారు. పాదయాత్రలో పాల్గొన్న వారి కోసం మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను నేతలు స్వచ్ఛందంగా అందించారు. కాగా, రాహుల్‌లో రాజకీయ పరిణతి, ప్రజలను ఆకట్టుకునే తీరు పెరిగాయని కాంగ్రెస్ సీనియర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని అభిప్రాయపడ్డారు. వడ్యాల సభలో రాహుల్ ప్రసంగం కూడా ఎంతో వ్యూహాత్మకంగా, పరిపక్వతతో సాగిందని నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును నేరుగా ఎక్కడా ప్రస్తావించకుండా రాహుల్ హుందాగా వ్యవహరించారని విశ్లేషించారు.